హరీ!'శతకపద్యములు.;- టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర.
 81.
ఉత్పలమాల.
పోరులఁ  గెల్చి ధారుణిని పొందిరి సౌఖ్యము రాజులెందరో!
వారల కేమి దక్కె? పరివారము తోడ నశించి పోయిరే!
సారెకు నిన్ను దల్చి మనసారగ మ్రొక్కిన ముక్తసంగులై
చేరరె భక్తులెల్లరును శీఘ్రమె నీపద సన్నిధిన్ హరీ!//

82.
చంపకమాల.
తిమిరపు భూతమున్ దఱిమి తీర్చగ భక్తుల కష్టనష్టముల్ 
కమలను దోడ్కొనీ భువికి గ్రక్కున  రావయ!దివ్యతేజ!మా 
భ్రమలను కాల్చువాడ!బహు బాధలఁ గ్రుంగెడి యీ జనంబుపై 
మమతను జూపరావ!!పరమాత్మ!దయాకర!పాహి!శ్రీహరీ!//
కామెంట్‌లు