నమ్ము నమ్మకపో! అచ్యుతుని రాజ్యశ్రీ

 ఫారో టుటాన్ ఖమున్ సమాధి చాలా సంపదతో నిండింది.వాటి వెల నిర్ణయిం చడం చాలా కష్టం.ఎవరైనా ఆసమాధికి కించిత్ అపకారం చేసినా సంపదను ఎత్తుకు పోయే ప్రయత్నం చేసినా ఇంతే సంగతులు.ఆసమాధిపై ఇలా రాసుంది " దీని అంతుచూడాలనుకుంటే వారు అక్కడే మటాష్.రాజుకి ఎలాంటి భంగం కలిగించరాదు.
1922లో హావర్డ్ కార్టర్ అనే ఆంగ్ల పురాతత్వ వేత్త ఈగోరీని చూశాడు. లార్డ్ కార్నర్వాన్ తొలి సారి ఇందులో ప్రవేశించాడు.దోమకాటుతో చనిపోయాడు కొద్ది కాలానికే.ఈజిప్ట్ రాజధాని కైరో లో ఒక్క సారిగా లైట్లు ఆరిపోయి చిమ్మ చీకటి ఆవరించింది.అతని కుక్క కూడా పెద్ద గా మొరుగుతూ చచ్చి పడింది.చాలామంది పురావస్తు శాస్త్రజ్ఞులు ఆగోరీని దర్శించి రోగాల పాలైనారు.1920లో పాతికమంది అలా ప్రాణాలు కోల్పోయారు.కానీ కొంతమంది వాదన ఏమంటే కార్టర్ 1939 దాకా తన 65 ఏటదాకా బతికి బట్ట కట్టాడు అని.మరి పిరమిడ్లు వాటిని గూర్చిన కథలు ఇంకా ప్రచారంలో ఉన్నాయి సుమా🌹
కామెంట్‌లు