త్యాగం- (బాలగేయం)-మమత ఐలకరీంనగర్-9247593432
పెళ్లి నగలకై బోయి పరుష రాముడు 
బకాసురునికి జిక్కుకునె నికాలస్సుగా
కమ్మనైన ఆహారం నిమ్మలంబుగా
కుడువబోగ నడిమికచ్చి పండు వృద్ధుడు

బ్రతికి యోజనము లేని బడుగు నేనని
నన్ను తిను నీయాకలి తీరుతుందనె
అంతటొక్క వృద్ధురాలు అడ్డంవచ్చి
భక్షించుము నన్ననుచు బ్రతిమిలాడెను

వారి జాడకై వచ్చిన పడుచు యువకుడు
వద్దు వద్దు వారిని విడి నన్ను తినమనె
అంతలోనె ఒక యువతి ఆగుము అనుచు
ముందుకచ్చి వృత్తాంతం చెప్పసాగెను

నా పెళ్లి నగల కొరకు నాయన వచ్చి
నీకు జిక్క వీరంత వెదక వచ్చిరి
మూలకారణం నేనని ముందుకురాగ
వంటలతో తల్లి వచ్చి వాదులాడెను

నేనంటే నేననెడి త్యాగ నడవడి 
బకాసురుడి గుణమంత మార్చివేసెను
ఇంటిల్లు మేలుగోరి మోదము తోడ
పిడికెడన్నమే చాలని విడెచె వారిని


కామెంట్‌లు