మంచిపని ;- . కనుమ ఎల్లారెడ్డి,93915 23027.

 .రాజు పుట్టిన రోజు  జనవరి 26, ఆ రోజు ఏమి ఏర్పాట్లు చెయ్యాలోనని ఆరాటపడుతున్నాడు. ఈ పుట్టిన రోజు కేకు కట్ చేయడం వద్దు, గుడికి వెళ్ళి దండం పెట్టుకోవడం వద్దు. ఏదయినా ప్రజోపకరమైన మంచి పని ఒకటి చేయ తలంచాడు. ఆలోచించి తన వీధిలో ఒకటి, రెండు చోట్ల బోర్లు వేయించాలని నిశ్చయుంచుకున్నాడు. అదే విషయం తల్లితండ్రులకు చెప్పాడు. వారు రాజు హుండీలో ఉన్న డబ్బుకు కొంత జమ చేసి "ఎక్కడ అయితే బోర్లు వేయాలనుకున్నావో ఆ స్థలం చూసి రా "అన్నారు. రాజు ఆ వీధిలో జనం బాగా కలిసే చోట రెండు ప్రాంతాలు ఎంచుకున్నాడు.ఒకటి బేకరీ దగ్గర, మరొకటి రామాలయం దగ్గర అని తండ్రికి చెప్పాడు. తండ్రి వెంటనే రాజు హుండీలోని డబ్బు కు తను కొంత జమ చేసి రాజు పేరు మీద కాకుండ "ప్రజా నీటి సౌకర్యం " అని బోర్డు వేసి బోర్లు వేయించాడు. అది చూసి రాజు సంతోషించాడు. "నేను కూడా ప్రజా అనే పేరే అనుకున్నా అని "తండ్రితో చెప్పాడు. తన ఆలోచన నెరవేరినందుకు, పుట్టిన రోజు  నా అభిప్రాయం తెలుసుకున్న నాన్న కు, నా మంచి పనికి, నా పని నెరవేర్చిన తల్లితండ్రులకు కృతజ్ఞతలు అర్పించాడు. నా హుండీలో పది వేలే ఉన్నాయి. నాన్న ఎక్కువ మొత్తం లో ఖర్చు పెట్టడంతో నాన్న లో ఉన్న సేవా గుణం రాజు ను ఆకర్శించింది. అదే రాజుకు ప్రతి పుట్టిన రోజు ఓ మంచి పని తల పెట్టె విధంగా చేసింది.ఆ రోజు సాయంత్రం ఆ వీధి కౌన్సిలర్ వచ్చి  పుట్టిన రోజున రాజు కు వచ్చిన మంచి ఆలోచన, తండ్రి సహకారం చూసి "అనవసర ఖర్చు కాకుండ ఇటువంటి మంచి పనికి పూ నుకున్న మీ ఇద్దరిని అభినందిస్తున్న. ఇలానే ప్రతి ఒక్కరూ తమ చేతనైనా సహాయం మీ పుట్టిన రోజు నాడో, లేక మరో రోజో చేస్తే మన ప్రాంతం, దేశం ముందుకు పోతుంది "అనగానే అందరూ చప్పట్లు చరిచారు.....
..........              
.

కామెంట్‌లు