ఆకాశవాణి విజయవాడ కేంద్రం- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 కాకాని వెంకటరత్నం గారు ఓ రోజు మా ఇంటికి వచ్చి మా నాన్న గారితో మాట్లాడుతూ పెద్దవాడు ఏం చేస్తున్నాడు అని అడిగితే వాడు పొలం వెళ్లాడు అని చెప్పగానే తన కారులో  తన డ్రైవర్ని పంపి అన్నను తీసుకువచ్చి ఆ రోజే మద్రాస్ పంపి  ప్రభుత్వ ఖర్చుతో ట్రైనింగ్ ఇప్పించారు ట్రైనింగ్ అయిన తర్వాత తేలప్రోలు హైస్కూల్లో అపాయింట్ మెంట్ ఇచ్చారు అలా మా అన్నయ్య టీచరు కావడం నాకు ఎంతో నచ్చింది  మా అన్నయ్య ప్రతి నెల ప్రతి మొదటి ఆదివారం ఉపాధ్యాయులందరినీ మా ఇంటికి భోజనానికి ఆహ్వానించేవాడు  వారికి వడ్డించే వారిలో నేను ఉండేవాడిని దాంతో టీచర్స్ అందరికి సమానంగా పడింది  స్కూల్లో ఏక ఛత్రాధిపత్యం వహించడం నా వంతు అయింది అప్పట్లో నా క్లాస్మేట్ రాగాల సుబ్బారావు నాకు మంచి డ్రిల్ రూమ్ లో మంచి పేరు ఉండేది దాంతో నన్నంతా కాకా పడుతూ ఉండేవారు ఆడపిల్లలకు బ్యాట్మెంటన్ మగవాళ్ళకి చెడుగుడు రన్నింగ్ లాంటివి ఉండేవి. మా స్కూల్లో ప్రతి ఉపాధ్యాయుడు ఒక మేధావే. బూర్గుల పురుషోత్తమ శాస్త్రి గారు తెలుగు పద్యం చెప్తే మళ్లీ మనం ఇంటి దగ్గర చదివే అవసరం లేదు  ముందు బెంచి నుంచి మధ్య బెంచి నుంచి చివరి బెంచిలలో ఒక్కొక్కరిని ఎన్నిక చేసి వారితో పద్యం చదివించేవారు తర్వాత ఆయన 10 విభజన చేసి ప్రతిపదానికి  దాని తాత్పర్యంతో సహా వివరించి చెప్పేవారు తర్వాత మాకు హెచ్ ఎం గా ఉన్న పోలు సుబ్బారెడ్డి గారు పోయమ్ చెప్పడానికి వచ్చేవారు ఆయన ఆంగ్లంలో పద్యం చదివితే ఎంతో కమనీయంగా ఉంటుంది. అర్థం తెలిసేది
ఆ తర్వాత ప్రసన్న కుమార్ గారు ఆర్మీ మ్యాన్ క్రమశిక్షణకు పెట్టింది పేరు వారి అబ్బాయి సత్యమూర్తి అప్పటికే ఏం.ఏ మానివేసి చాలా ప్రయోగాలు చేశారు మా ప్లే గ్రౌండ్లో చింత చెట్లు అధికంగా ఉండేది ఒక చెట్టు కింద కూర్చుని ఏదో ఆలోచిస్తూ ఉండేవాడు తనకు తెలియని అనేక విషయాలు గురించి ఎంతో మదన పడుతూ ఉండేవాడు  మా రెండో అన్నయ్యకు ఆయనతో ఎంతో సన్నిహిత సంబంధం ఉండేది నన్ను చిన్ని అని పిలుస్తూ ఉండేవాడు తర్వాత హిందీ పండితుడుగా వరంగల్ వెళ్లి కొండపల్లి సీతారామయ్య గారితో స్నేహం చేసి వారిద్దరూ కలిసి పీపుల్స్ వార్ గ్రూప్ స్థాపించి ఉద్యమాన్ని నడిపించారు  జీవితాంతం దానిలోనే పనిచేసే  వాడు  అందరితో సన్నిహిత సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు  అతని మనసు వెన్న.
కామెంట్‌లు