ఆకాశవాణి విజయవాడ కేంద్రం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322.

 మా ఊరి మధ్యలో రామాలయం ఉంది దాని ప్రక్కనే వేమన గ్రంథాలయం  దానిని మా నాన్నగారు  స్థాపించారు ఉదయం పత్రిక వచ్చేసరికి చాలా తేలప్రోలులో ఉన్న కమ్యూనిస్టు నాయకులందరూ గ్రంధాలయానికి వచ్చేవాళ్ళు  మా నాన్న 10 గంటలకు అప్పటికే విశాలాంధ్ర పత్రిక ప్రజాశక్తి అన్న పేరుతో వచ్చేది దానిని చదవటానికి జొన్నపాడు నుంచి కొండపల్లి సీతారామయ్య గారు సైకిల్ మీద వచ్చే వారు. మా నాన్నకు చాలా సన్నిహితుడు వారు ఇద్దరు కూర్చుని చాలా విషయాలు చర్చించుకునేవారు అలాంటి వారితో ఉండడం మా నాన్నకు నచ్చింది కారణం ఆయన దేశం కోసం స్వాతంత్రం కోసం జైలుకు వెళ్లి ప్రభుత్వ స్వాతంత్ర సమరయోధులకి ఇచ్చే ఐదు ఎకరాలు భూమిని కాదని సమాజ సేవ చేస్తూ ఆయన జీవితాన్ని కొనసాగిస్తున్నారు. మహాత్మా గాంధీ హరిజన ఉద్యమాన్ని ప్రారంభించడానికి ముందే మా గ్రామంలో ఉన్న మాల మాదిగలలో దేవుని చూడాలి అనుకునే వారిని పిలిచి దేవాలయ ప్రవేశం చేయించాడు చాలామంది గ్రామస్తులు వ్యతిరేకించినా వారికి నచ్చ చెప్పి ఆ పని చేశాడు మా నాన్న. దళితుడు ఇంటి పనికి పనికిరాడు అని పక్కన పెడితే వారిని తీసుకువచ్చి ఇంటి పనులు మొత్తం చేయించారు మా ఇంట్లో బావిలో నీరు తోడ్డానికి దళితులు పనికిరారు అని నిషేధిస్తే మాలవారిని పని వారిని మా ఇంటి ముందు బావిలో నీరు తోడించి ఆదర్శప్రాయుడయ్యారు  వితంతువు వివాహాలను ఎన్నో చేయించారు ఆరుమళ్ళ కోటేశ్వరమ్మ గారికి బాల్యవివాహం జరిగింది  ఆవిడ 12వ సంవత్సరంలో ఉండగా భర్త చనిపోయాడు ఆమె వితంతువు అయింది.
ఆమెను గురించి కొండపల్లి సీతారామయ్య గారికి చెబితే ఆవిడని చేసుకోవడానికి నాకేం అభ్యంతరం లేదు కానీ మా ఇంట్లో మా అమ్మానాన్న ఒప్పుకోకపోవచ్చు మీరు ఒకసారి వచ్చి వారిని ఒప్పించండి అని చెప్పితే మా నాన్న జొన్నపాడు వెళ్లి అక్కడ తనకు తెలిసిన వ్యక్తిని తీసుకొని వాళ్ల అమ్మానాన్నలను ఒప్పించి కోటేశ్వరమ్మ గారి వివాహం జరిపించారు ఆ వివాహం అయిన తర్వాత సీతారామయ్యగారు కూడా వరంగల్ వెళ్లి హిందీ పాఠాలు చెప్పడానికి ఉపాధ్యాయునిగా చేరారు అక్కడ ఆయనకు సత్యమూర్తి పరిచయం అయ్యాడు తర్వాత కొన్ని రోజులకు  మనం కులం పేరుతో ఎందుకు తిట్టుకుంటున్నాము అని వారిలో వారు చర్చించుకుని కులం ఉండబట్టే కదా మనం అలా తిట్టుకుంటున్నది ఈ కులాన్ని లేకుండా చేస్తే సమాజం ఎంతో బాగుపడుతుంది అని ఆలోచించి ఇద్దరు కలిసి పీపుల్స్ వార్ గ్రూపును ఉద్యమంగా ప్రారంభించారు.
కామెంట్‌లు