ఆకాశవాణి విజయవాడ కేంద్రం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322

 రజని గారు పెక్స్ గా పనిచేసిన స్టేషన్ డైరెక్టర్ గా చేసిన ఆయన పనంతా ఆయన ఆఫీసులో కాదు మ్యూజిక్ స్టూడియోలోనే  ఆవలించకుండానే పేగులు లెక్కించగల మేధస్సు ఎప్పటికప్పుడు నూతన కార్యక్రమం రూపకల్పన చేస్తారు సామాన్యులకు కూడా రేడియోలో భాగస్వామ్యం కల్పించిన   వారు  రజని గారే  దుఃఖార్తుల వేశ్యల నిజ జీవితాలను వారి మాటల్లో చెప్పించాలని తలచి ఆ కార్యక్రమాన్ని నాకు సుమనకి అప్పజెప్పి ఏ స్థితిలో వారు ఆ వృతిని చేపట్టవలసి వచ్చింది అనుకున్నారు దానితో ఎన్నో కొత్త కోణాలలో కొత్త జీవితాలు శ్రోతలకు అర్థమయ్యేలా దాదాపు ఆరు సంవత్సరాల పాటు ఆ కార్యక్రమాన్ని నిర్వహించాము  ఈ సందర్భంగా ఓ సంఘటన తెలియజేయాలి  ఈ కార్యక్రమాన్ని  తిన్నగా వారి ఇంటికి వెళ్లి చేయడానికి వీలు లేదు  కారణం మమ్మల్ని  స్త్రీలోలురు  అనుకునే ప్రమాదం ఉంది. అందువల్ల ఆ కార్యక్రమాన్ని పోలీస్స్టేషన్లో రక్షక భటుల సమక్షంలో చేసేవాళ్లం  ఒకరోజు సుజాతన మహిళను తీసుకువచ్చారు పోలీసులు  నీవు ఈ వృత్తి లోకి రావడానికి కారణం ఏమిటమ్మా అని అడిగితే  ఏ వృత్తి అండి ఆవిడ ఎంతో అమాయకంగా అనడం నాకు ఆశ్చర్యం వేసింది  ఆమెను పోలీసులు కొట్టి తిట్టి సమాధానం రాబట్టటానికి ప్రయత్నం చేస్తే మేము అడ్డగించి విషయం చెప్పమంటే ఆవిడ కన్నీటి పర్యంతమై మా ఆయన లారీ డ్రైవర్ అండి  నిన్న బొంబాయి వెళ్లారు ఆరు రోజుల వరకు ఆయన రారు మా అబ్బాయి స్కూల్ నుంచి వస్తాడు త్వరగా నన్ను ఇంటికి పంపించండి  అని ఏడ్చింది తీరా విచారిస్తే అంతకు ముందు వీళ్ళు ఉన్న ఇల్లు  వేశ్యా గృహం  వాళ్లు ఖాళీ చేసిన తర్వాత మీరు అద్దెకు వచ్చారు  వాళ్లే వీళ్ళని ఆమెను కానిస్టేబుల్ తీసుకొచ్చాడు  నేరం చేసిన వాళ్ళని శిక్షించవచ్చు.
నేరం చేయకుండా శిక్షలను వేస్తే ఆమె మానసిక స్థితి ఏమిటో ప్రత్యక్షంగా తెలుసుకున్నాను అలాంటి జీవిత సత్యాలను తెలుసుకున్న అవకాశం ఇచ్చినవారు డాక్టర్ బాలాంతరపు రజనీకాంతరావు గారు  ఆ విషయం తెలిసి రజనీ గారు ఈ కార్యక్రమం మీకు ఎందుకు అప్పగించాను అని అడిగి నేను సమాధానం చెప్పేలోపే  ప్రపంచ ప్రఖ్యాత నవలాకారుడు క్రైమ్ అండ్ పనిష్మెంట్ (నేరము శిక్ష) నవల చదివావా  నేరం ఎన్ని రకాలు ఏ నేరానికి ఏ శిక్ష విధించాలో దానికి చక్కటి మానసిక విశ్లేషణ అద్భుతం కానీ ఇక్కడ మీకు ఎదురైన సమస్య దానికి విరుద్ధమైన రూపము ఆమె చేయని నేరానికి శిక్ష అనుభవించింది  ఆమె మానసిక స్థితి ఎలా ఉంటుంది గోర్కి మహాశయుడైతే ఆ విషయాన్ని గురించి అద్భుతమైన మరో నవలను సృష్టించగలరు అన్నారు.
కామెంట్‌లు