పరిపక్వ నిర్ణయం - జె వి కుమార్ చేపూరి -హైదరాబాద్-96407 12062
కుసుమ ధర్మన్న కళాపీఠం  -  
--------------------------------------
చదువెందుకు చందమామను చేరుకోనా
నాలుగు ఆవులను పెంచితే ఇంటిలోన
పాలిచ్చును, పెరిగిచ్చును, వెన్నిచ్చును
అన్నాడో కవి, ఏనాడో నిశ్చయముగను 

పిల్లలకుండదు విదేశీ చదువులమీదంత మోజు 
వాటిపై తల్లిదండ్రులకే ఎందుకో అమిత క్రేజు
నేటి గురించి ఆలోచించడమే వారి రివాజు 
ఎరుగరది, చేరుస్తుందని వృద్ధాశ్రమాన్నో రోజు

పిల్లలు తమనంటి పెట్టుకొని ఉంటామనడం 
కన్నవారు చేసుకున్న పూర్వ జన్మ పుణ్యం
విదేశాలకెళ్ళి ఆర్జించినా అంతులేని విత్తం 
తినేది మాత్రం అన్నమే, కాదు బంగారం
అదర్ధమౌతే పంపరు పిల్లలను పరాయిదేశం

కొడుకు చేస్తానంటున్నది కాదెవరికో ఊడిగం
తమకున్న కొద్దిపాటి పొలాన  సేద్యం
దేశానికి అన్నం పెట్టే మహోన్నత కార్యం
యువతరానికుంటే ఇలాంటి దృక్పథం 
ఉత్పన్నం, విశ్వాన కరువెరుగని భూభాగం
స్వర్గ తుల్యమే ఇక పెద్దతరపు చరమాంకం

కొడుకును వెనకేసుకొచ్చిన తండ్రి వ్యక్తిత్వం 
సతతం సముచితం, అభినందనీయం 
తోడైతే దానికి సోదరి మద్దతు సంపూర్ణం 
తప్పదు, మాతృమూర్తికిక మౌన అంగీకారం
తనయుడు తీసుకున్న పరిపక్వ నిర్ణయం
చేర్చి తీరుస్తుందా కుటుంబాన్ని ఉన్నత శిఖరం

కామెంట్‌లు