బతుకు లెక్క;- అంకాల సోమయ్య-దేవరుప్పుల- జనగాం-9640748497
ఏదో అలా బ్రతికేస్తున్నాం!
చావలేక బ్రతుకుతున్నాం!

మామధ్యతరగతి బ్రతుకు ల్లో
అప్పులకుప్పలు
వెనకేసే ఆదాయమే లేక
అంతుచిక్కని రోగమొస్తే
సాంతం అమ్ముకొని?!
మళ్ళీచస్తూ బ్రతుకుతూ నే ఉంటాం!

పాతిన గుంజలెక్కనిటారుగా
నిలబడలేము
లే‌స్తూపడుతూ!?
ఆవలి తీరం వైపు చూస్తూ ఉంటాం
కానీ ఎప్పటికైనా!
చేరుతమోలేదో?!

అంతా కళ్ళముందే
భవిష్యత్తు కనబడుతుంది
దీన్ని ఎమ్మారై స్కానింగ్
తీయాల్సిన అవసరమేముంది

జీవితం అంటేనే ఎత్తూ పల్లాలు
ఉత్థాన పతనాలు
గెలుపోటములు
ఇదేకదా
 మధ్యతరగతి
భారతం
చచ్చే దాకా
ఎలాగో అలాగా
జీవించాలి
ఎందుకంటే ?ఎవడికైనా!
మరణం తప్పదు కదా!?

కామెంట్‌లు