వివిధ ;- అంకాల సోమయ్య- దేవరుప్పుల- జనగాం9640748497
నా అంతర్ముఖమే నేను
నా సంతోషాలు సంతాపాలు
కవిత్వంగా వ్రాస్తున్నా

మోడు బారిన చెట్టులా
నిస్సహాయుడైన నన్ను
ఊతమిచ్చిపచ్చని చిగురాకుకు
చిరునామా అవుతారా?!

సెలయేరు ఎండి
గుండెలో తడారి బ్రతుకు ఎడారైనప్పుడు
దేబిరించి ఆశగా ఎదిరి చూపులూ!?

చేవచచ్చిన దేహం నిరాశ నిస్పృహల్లో మనస్సున్నప్పుడు 
ఆశాలేపనం పూస్తారా!?

బ్రతుకు లేదు
 భరోసా లేదు
తీపి జ్ఞాపకములేదు
పంజరంలో బంధియైన పక్షినినేను

మాయికులు హరించిన బాల్యం
బాంచబ్రతుకే బహుమానం
ఆసామికి ఊడిగం చేయడమే
మా ఉద్యోగం
హోరుగాలిలోని దీపాలం మేము

ముగిసిన ఆనందం
దక్కునా ఎప్పటికైనా
ఆ స్వేచ్ఛాస్వర్గం
మాదనుకున్న బ్రతుకు మాదికాదు

కట్టుబానిసలంమేము
కసాయోడి చేతికత్తికి
తెగిపోయే తలలంకామెంట్‌లు