స్త్రీలకు పురుషులతో సమాన అవకాశాలు దక్కాలి;-అంకాల సోమయ్య-దేవరుప్పుల- జనగామ-9640748497
చట్టసభల్లో
మహిళలకు
పెద్దపీట వేశారు
ఇంతలోనే
ఆడదాని పెత్తనం
తంబళ్లదొరతం
అని ఎద్దేవా చేసే
కుహనా సంప్రదాయవాదులు
వీరెప్పుడిచ్చారు గనుక
అమ్మలకు స్వేచ్ఛను 
వంటింటికి మహారాణిఅమ్మైనా
మన అమ్మలు ఇప్పటికీ
తనకు నచ్చింది 
వండుకొని తినే స్వాతంత్ర్యం 
ఉన్నదా?!
ఎదురు తిరిగే
సాహస మన్నా చేసారా?!
అక్కచదువు కుంటానంటే
నాన్న ససేమిరా
వద్దన్నప్పుడు
నాన్నను ఒప్పించడానికి
అమ్మ నాన్న తో
మహాయుద్ధమే చేయవలసివచ్చింది
కదా?!
ఇప్పుడిలా
తన ఆడబిడ్డలు గొప్ప గొప్ప
చదువులుచదివితే  అధికకట్నకానుకలు
ఇవ్వవలసి వస్తుందని
చదువును అర్థాంతరంగా
ముగించాడు మానాన్న
ఇలాంటి అహంభావులు
ఆడపిల్లలను
పాలనా రంగంలోకి
రావాలనే 
ఆశవున్నా
అది నెరవేరని కలే యని
 బీరాలు పలికిన
వారెందరో
ఆడబిడ్డలకు 
ఇంట్లోనే
తమ అవకాశాలను అభివృద్ధిని 
అడ్డుకునే
నాన్న 
అన్న 
భర్త 
మామ
ఇలాంటి వాళ్లంతా
స్త్రీకి 
బద్ధశత్రువులే కదా?!
ఇలాంటి
సంకుచిత 
మనస్తత్వమున్న
 వారు విజ్ఞతతో
ఆలోచించి
 అమ్మలను
చట్టసభలకు పంపాలి
అమ్మలు
 ఈ జగమునేలితే
అవినీతి రహిత పాలన మనకందుతుంది
జయహో మహిళా
జయ జయహో మహిళా
మహిళా శక్తి మహాశక్తి
ఆడదంటే అబల కాదు సబల
ఆడదంటే ఆకాశంలో సగం
దేశజనాభాలో సగం
అందుకే
 స్త్రీ పురుష వివక్ష చూపక
అవకాశాల్లో 
సగభాగమిద్దాం
వారికి సముచిత స్థానం మిచ్చి
గౌరవించుకుందాం
 (ఆడపిల్లలు పట్ల వివక్ష చూపే వారినుద్దేశించి వ్రాయడం జరిగింది ఈ కవిత)

 

కామెంట్‌లు