నేను జాగ్రత్తపడుతున్నా;- అంకాల సోమయ్యదేవరుప్పులజనగాం9640748497
నిన్ను మంచివాడని నమ్మితే
నాకు నీవుతేనె పూసిన మాటలతో దగ్గరైతివి

నువ్వు దగా చేసి వెళ్లిపోయేదాకా
నీ మాటల మర్మం నేనెరుగనైతి

నేను పాలను నీళ్లను వేరు చేసే మరాళాన్ని కాదుకదా

నేను నా చుట్టూ ఉన్న మనుషులంతా మంచోళ్ళని నమ్మే అమాయకున్ని

అరి చేతిలో వైకుంఠం చూపి
అందిన కాడికి నాధనాన్ని
నా శక్తియుక్తులనంతా  దోచి

నన్ను నడి బజార్లో దిసమమొలతో నిలబెట్టిన
నీ నయవంచనా
నేను ముందే పసిగట్టనైతి 

చేతులు కాలినాక 
ఆకులు పట్టుకున్న చందంగా ఇప్పుడు నేను వెక్కి వెక్కి ఏడ్వబడితిని

మునుపెన్నడో
మాఅవ్వ నా చిన్నప్పడు
నాతో అంటుండే పొరుగూరోణ్ణి
 కన్నా ఉన్నూరోడు మేలురా
అని

అప్పుడు మా అవ్వ మాటల్లో అంతరార్థం (మర్మం)నేను తెలుసుకోలేకపోతి

ఇప్పుడు యాదికొచ్చి నా తెలివి లేని తనాన్ని 
నా అమాయకత్వాన్ని చూసి  నా మీద నాకే జాలి కలుగుతుంది

ఇదంతా స్వార్థపూరిత లోకం

వాళ్ళ అవసరానికి మనుషుల్ని వాడుకుంటారు

వారి అవసరం తీరాక
మనతో మాటైనా మాట్లాడరు

మన ముఖమైన చూడరు

ఇప్పుడు నేను జాగ్రత్తగా ఉండడం నేర్చుకున్నా

ఏ పనైనా ఆచితూచి
చేయడానికి సిద్ధపడుతున్నా

ఎంత జాగ్రత్తగా ఉన్నా
ఎప్పుడే ఉపద్రవం ముంచుకొస్తుందో నన్నదిగులు
నన్ను వెంటాడుతుంది
నేను లోకం తెలియనోణ్ణి

ఏదేమైనా లోకం, లోకులు
వారి భిన్న మనస్తత్వాలను
మించిన పెద్ద పాఠం మరొకటి లేదని నేను గట్టిగా నమ్ముతున్నా
అందుకే నేను ‌ఇప్పుడు
"జాగ్రత్త" పాఠాన్ని మరీమరీ
వల్లె వేస్తున్నకామెంట్‌లు