పిల్లలను స్వేచ్ఛగా ఎదగనివ్వండి;- అంకాల సోమయ్యదేవరుప్పుల జనగాం 9640748497
పిల్లలను స్వేచ్ఛగా
ఎదగనివ్వండీ
ముందరి కాళ్ళకు బంధాలేసి
లోకం తెలియని అజ్ఞానులను
చేయకుండి

వేలకు వేలు వారి విద్యాబుద్ధులకై ఖర్చుచేసే
తల్లిదండ్రులు మీ మూలాల్ని
మీ రెక్కాడితే కానీ డొక్కాడని
మీ బ్రతుకు చిత్రాన్ని ఏకరువుపెట్టండి

పిల్లలకు అప్పులు తెచ్చి
విద్య ఆర్థిక వనరు అని
నమ్మబలికిన 
కార్పోరేట్ మాయాజాలం
పసిగట్టి ముందు కెళ్ళడం
నేర్చుకొమ్మని
సమకాలీన ఆర్థిక సామాజిక అంశాలను ఎప్పడికప్పుడు
తెలుసుకొమ్మని
మీ పిల్లలకు భుజం తట్టిచెప్పండి

మానవుడి అత్యాశకు ప్రకృతి
వికృత రూపం దాల్చితే
సాంకేతికాభివృద్ధి కొరగానిదైపోతే

ఉద్యోగం రాకున్నా ఆత్మగౌరవం తో బ్రతకడానికి
సంప్రదాయ వృత్తులైనా
నేర్చుకొని బ్రతకేలా!?
వారికి తర్ఫీదు ఇవ్వండి

పిల్లలతో ముఖాముఖి సంభాషించండి
వారి వారి భయాలు , నిరాశలు
పారద్రోలి
స్వీయ ఆత్మగౌరవంతో బ్రతకేలా
ప్రేరణ కల్గించండి
సంపదున్నప్పుడు అహంభావాన్ని
లేనప్పుడు బేలతనాన్ని ప్రదర్శించకుండా
ఆశావాదాన్ని 
ఆత్మవిశ్వాసాన్ని పాదుకొల్పండికామెంట్‌లు