నేను బడికి పోయేటప్పుడు
రెండు లాగులు
రెండంగీలే ఉండె
ఒకటి ఒంటిమీద
ఇంకొకటి దండెం మీద
పదవతరగతి లో
ఉన్నప్పుడు
మా నాన్నతో
లొల్లి పెట్టుకుంటే?!
మానాన్న అప్పుడు
నాకు కొత్త పాయింట్
కొత్త షర్టు
కుట్టిచ్చిండు!?
ఇంత ఖర్చుపెట్టిస్తున్నవు
బిడ్డా !
రేపు పదిపాస్ కాకపోదువూ?!
ఈపు ఇమానంమోతే?
అని గద్దించిండు!
ఆ భయానికే!?
రాత్రి పగలు చదివి
ఫస్ట్ క్లాస్ లో పాసైన
మా నాన్న
తానే పదిపాసైనంత
సంతోషం
నేను కళ్ళారా చూసిన
ఇప్పటితరానికి
పాయింట్ షర్ట్
ఫస్ట్ బర్త్ డే కి
కుట్టిస్తున్న
తల్లిదండ్రులునేడు
ఎంతలో ఎంత మార్పు
డబ్బు అగ్గువైనదా!?
ఈజీ మనీ
ఇప్పుడీ
తల్లిదండ్రులు సంపాదిస్తున్నారా!?
పదిపాసైతే?!
బైకు కొనిచ్చేతల్లిదండ్రులు
ఇంటర్ స్టేట్ ర్యాంక్
ఎంసెట్ లో మంచి ర్యాంకు
వస్తే
కారు గిఫ్ట్ గా ఇచ్చే
తల్లిదండ్రులున్నారు!?
ఎంతలో ఎంత మార్పు
కష్టం తెలియకుండా పెంచడం!
తాము సాధించాలనుకునే
అన్నీ లక్ష్యాలు
పిల్లలు సాధిస్తుంటే!?
తదాత్మీకరణం చెందే తల్లిదండ్రులు
రేపు వారి(రి) బిడ్డల ఉద్యోగజీవితం,
సంసార జీవితం
సంఘర్షణకు లోనైతే
కన్నీరు మున్నీరుగా విలపించే
తల్లిదండ్రులు
తమ పెంపకలోపాన్ని
ఇప్పుడు సరిదిద్దలేక
చేతులు కాలాక ఆకులు పట్టుకున్నవైనం ?!
రెండు లాగులు
రెండంగీలే ఉండె
ఒకటి ఒంటిమీద
ఇంకొకటి దండెం మీద
పదవతరగతి లో
ఉన్నప్పుడు
మా నాన్నతో
లొల్లి పెట్టుకుంటే?!
మానాన్న అప్పుడు
నాకు కొత్త పాయింట్
కొత్త షర్టు
కుట్టిచ్చిండు!?
ఇంత ఖర్చుపెట్టిస్తున్నవు
బిడ్డా !
రేపు పదిపాస్ కాకపోదువూ?!
ఈపు ఇమానంమోతే?
అని గద్దించిండు!
ఆ భయానికే!?
రాత్రి పగలు చదివి
ఫస్ట్ క్లాస్ లో పాసైన
మా నాన్న
తానే పదిపాసైనంత
సంతోషం
నేను కళ్ళారా చూసిన
ఇప్పటితరానికి
పాయింట్ షర్ట్
ఫస్ట్ బర్త్ డే కి
కుట్టిస్తున్న
తల్లిదండ్రులునేడు
ఎంతలో ఎంత మార్పు
డబ్బు అగ్గువైనదా!?
ఈజీ మనీ
ఇప్పుడీ
తల్లిదండ్రులు సంపాదిస్తున్నారా!?
పదిపాసైతే?!
బైకు కొనిచ్చేతల్లిదండ్రులు
ఇంటర్ స్టేట్ ర్యాంక్
ఎంసెట్ లో మంచి ర్యాంకు
వస్తే
కారు గిఫ్ట్ గా ఇచ్చే
తల్లిదండ్రులున్నారు!?
ఎంతలో ఎంత మార్పు
కష్టం తెలియకుండా పెంచడం!
తాము సాధించాలనుకునే
అన్నీ లక్ష్యాలు
పిల్లలు సాధిస్తుంటే!?
తదాత్మీకరణం చెందే తల్లిదండ్రులు
రేపు వారి(రి) బిడ్డల ఉద్యోగజీవితం,
సంసార జీవితం
సంఘర్షణకు లోనైతే
కన్నీరు మున్నీరుగా విలపించే
తల్లిదండ్రులు
తమ పెంపకలోపాన్ని
ఇప్పుడు సరిదిద్దలేక
చేతులు కాలాక ఆకులు పట్టుకున్నవైనం ?!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి