శంకరం శంకరాచార్యం కవిమిత్ర, శంకర ప్రియ., శీల.,-సంచార వాణి: 99127 67098
 🚩శంకర భగవానుని
 దివ్యావతార మూర్తివి!
     జయ శంకర దేశిక!
 జయ జయ గురుదేవ!
🚩మత్తగజము లనెడు 
శంకలను అరికట్టు
   జ్ఞానాంకుశ ధారి వీవె!
 జయజయ గురుదేవ!
         (అష్టాక్షరీ గీతి., శంకర ప్రియ.,)
 🔱జగద్గురు ఆదిశంకరులే... శంకర భగవానుని అవతార స్వరూపులు! 
"అంతర్యామి ఒక్కడే!"అని; అద్వైత సిద్ధాంతమును ప్రతిపాదించారు!
వేదసమ్మతంగా  మన సనాతన భారతీయ ధర్మమును తిరిగి నెలకొల్పారు! 
👌శంకర భగవత్పాదులు ... తత్త్వజ్ఞాన మనెడు దివ్యాంకుశముతో, లోకoలో నున్న  మదపుటేనుగుల వంటి కుశ్శంక సిద్ధాంతములను ఖండించారు! స్వాత్మ తత్త్వజ్ఞానమును ఉపదేశించారు, ఆచార్య శంకరులు!
🚩ప్రార్థనా శ్లోకం
శంకరం శంకరాచార్యం
సర్వశంకా గజాంకుశమ్!
అద్వైతసిద్ధి బోద్ధారం
ప్రణమామి జగద్గురుమ్!
      ********
    🚩కంద పద్యం
   శంకరు  శంకర గురువుల
   శంకలను దీర్చినట్టి సామజ సృణి సా
    లంకృత నద్వైతబోధకు
   శంకర దేవునికి నతులు సన్మతి నిడుదున్
           (👌సృణి = అంకుశము)
 
    [..డా  శాస్త్రుల రఘుపతి.,]
      **************
🚩తేటగీతి పద్యం 
 అఖిలశంకల గజమున కంకుశంబు
భువిని యద్ద్వైతసిద్ధికి బోధగురువు 
ధరణి వెల్గొందు శ్రీజగద్గురువునకును 
శంకరుడె యైన శంకరాచార్యునకును 
భక్తి తోడుత  నతుడనై ప్రణతు లిడుదు.
         
      [..గోపాలుని మధుసూదనరావు.,]
          ************
🚩 కంద పద్యం 
శంకర రూపులకు నతులు
 అంకుశమై గజమువంటి  అధ్రువముల ని
శ్శంకగ తీర్చిన లోక వ
శంకరు నద్వైత విజ్ఞు సన్నుతి జేతున్!      
      (👌అధ్రువము = శంక, సందేహము )
      [...పద్మ చిగురాల.,]
🔱జయ జయ శంకర!
     హర హర శంకర!

కామెంట్‌లు