అల లంకానగరం;- కవి మిత్ర శంకర ప్రియ., శీల.,-సంచార వాణి:- 99127 67098
 👌సీతమ్మను బంధించింది
శత్రు దుర్భేద్య మైనది
     అల లంకా నగరము
ఓజోవతి! ఓ సుమతీ!
      [అష్టాక్షరీ గీతి., శంకర ప్రియ ,]
 👌శ్రీసీతారాములు, లక్ష్మణునితో కలిసి, అరణ్యవాసం కొనసాగిస్తున్నారు! ఆ సమయంలో  రాముడు, పర్ణశాల యందు లేనప్పుడు; సీతాదేవిని అపహరించాడు, రాక్షస రాజైన రావణాసురుడు! ఆమెను.. లంకాపురిలో అశోకవృక్షములున్న తోటలో బంధించాడు! 
👌అల లంకానగరం.. వజ్ర వైడూర్య రత్న మాణిక్యములతో శోభించు చున్న, స్వర్ణసౌధములతో విలసిల్లుచున్నది! అట్లే, మల్లికా మాలతీ మాధవీ కుంద మందార పుష్పములతో నున్న, సుందరమైన ఉద్యానవనములతో  అలరారుచున్నది! దానిని..  లంకిణి యను, రాక్షసి సంరక్షించుచున్నది. శత్రువులు జయించుటకు  సాధ్యము కానిది... ఈ లంకానగరము!
   ( ఆంజనేయస్వామి వర్ణించిన లంకానగరము)  
        🚩దండకము
        ... స్ఫురద్ధేమ లంకాపురిన్ జేరి, తద్వార సంరక్షణోద్యోగి రాత్రించరిన్, లంకిణిన్ ముష్టి ఘాతంబులన్ గూల్చి, సూక్ష్మాకృతిన్ లోని కేతెంచి;
     మాణిక్య సందీప్తముల్ సుందరోత్తుంగ సౌవర్ణ రమ్యాతి రమ్యంబులౌ హర్మ్యముల్, శిల్ప సందోహ సంకీర్ణ వైడూర్య రత్నాళితో వెల్గు ప్రాసాదముల్, మల్లికా మాలతీ మాధవీ కుంద మందార సౌగంధ పుష్పావళీ వల్లికా శ్లిష్ట శోభా విరాజన్మణీ వర్ణ చిత్రాద్యలంకార స్థంభాదులున్ కుడ్యజాలంబులున్,
      దర్పదోర్దండ శుండాలభండుల్ మహాక్రూరదృష్టుల్ నికృష్టాయుధానేక హస్తుల్ సదా యప్రమత్తుల్, సురాపాన మత్తుల్, దురాయత్త దైత్యుల్ నిరాటంకులై కాపలాయుండగా,
      శత్రుదుర్భేద్యమౌ గొప్ప ప్రాకారముల్ సంభ్రమాశ్చర్య చిత్తంబుతో వీధుల, న్నంబరమ్మంటు తాళాది వృక్షమ్ములన్,   నృత్య సంగీత యుక్తంబులౌ వాద్య బృందమ్ములన్,  గానమాధుర్య సంరంభ తోషాస్యలౌ కామినీ కాముకుల్, నాయికీ నాయకుల్, మద్యమున్ ద్రావి, పెన్మాంస ఖండమ్ములన్ సుష్టుగా మెక్కి, మత్తెక్కి తైతక్క లాడేటి, లంకాపురీ పౌరులన్ జూచుచున్ యాంజనేయుండు....   
       [...హనుమ ద్దండకం., జి. ఆర్. కె. పరమహంస.,]
 🚩జయ శ్రీరామ్!  జయ హనుమాన్!!

కామెంట్‌లు