అనుమానం... పెనుభూతం;- -గద్వాల సోమన్న,9966414580
అహర్నిశలు  అనుమానము
జీవితాన పెనుభూతము
అపార్థాలతో  అగును
అనర్థాలకు కారణము

బంధాలను చెడగొట్టును
శీలాన్ని చెరపట్టును
పచ్చని కాపురాల్లో
సంశయము చిచ్చుపెట్టును

అనుమానము ముదిరితే
ప్రాణాలను తీస్తుంది
మానసిక రుగ్మతలను
కలుగజేసి హరిస్తుంది

విషం వంటి అనుమానము
మనసులను,పరిసరాలను
విషపూరితము చేయును
ప్రేతల స్థలంగా మార్చును

స్నేహితులను విడదీయును
ద్రోహానికి ఒడిగట్టును
ఆదిలోనే త్రుంచాలి
లేకున్న పాతిపెట్టును

అగ్ని కీలలు శంకలు
దహించి వేయు బ్రతుకులు
దూరముంటే క్షేమము
భవితను చేయును హేమము

మనసులోన సంశయాలు
పాడుచేయు జీవితాలు
జరిగిస్తాయి ఘోరాలు
చేయిస్తాయి నేరాలు

అదొక మానసిక వ్యాధి
సరైన చికిత్స ఏది?
అనుమానం రాకుండా
ఉంటేనే బహు మంచిది


కామెంట్‌లు