జీవిత సత్యాలు-ఆణిముత్యాలు;- -గద్వాల సోమన్న,9966414580
నవనీతము మనసులు
చేయరాదు గాయము
విలువైనవి పలుకులు
తప్పరాదు న్యాయము

బహు గొప్పది స్నేహము
పూనరాదు ద్రోహము
చితి మంటలు గర్వము
చూపరాదు అనిశము

అగ్ని వంటి ద్వేషము
చేయు బ్రతుకు ద్వంసము
దూరమున్న  క్షేమము
దొరుకుతుంది శాంతము

శ్రేష్టమైన జ్ఞానము
కలిగియున్న లాభము
చేసుకోకు దూరము
బ్రతుకు అగును ఘోరము

ప్రతిరోజూ  ధ్యానము
చేస్తేనే భాగ్యము
హృదయాల్లో నెమ్మది
పంచును ఆరోగ్యము

కన్నవారి ప్రేమలు
వెలుగుతున్న ప్రమిదలు
గుబాళించు పూవులు
అభివృద్ధికి త్రోవలు


కామెంట్‌లు