కుటుంబ కవిత;- కె. ఉషశ్రీ. 9వ తరగతి-జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నీర్మాల.
కుటుంబం ,కుటుంబం, కుటుంబం,
అందరూ కలిసి ఉండేదే కుటుంబం,

రక్త సంబంధం కుటుంబం,
ప్రేమానురాగాలు ఉండే కుటుంబం,

జోల పాడే కుటుంబం,
తప్పటడుగులు నేర్పే కుటుంబం,

పిలుపును నేర్పే కుటుంబం,
పెంచి పెద్ద చేసే కుటుంబం,

అమ్మ నాన్న కుటుంబం,
అక్క చెల్లి తమ్ముడు కుటుంబం,

అవ్వ తాత కుటుంబం,
పద్ధతి నేర్పే కుటుంబం,

బడికి పంపి చదివించే కుటుంబం,
బాధ తీర్చే కుటుంబం,

ఆనందాన్ని పంచే కుటుంబం,
పెండ్లి చేసే కుటుంబం,

కడుపునిండా అన్నం పెట్టే కుటుంబం,
కథలు చెప్పే కుటుంబం,

కన్నీళ్లు రానివ్వకుండా చూసే కుటుంబం,
నవ్వుతూ ఉండే కుటుంబం,

ఆపద రాకుండా చూసే కుటుంబం,
అందమైనది మా కుటుంబం,

కామెంట్‌లు