శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )-ఎం. వి. ఉమాదేవి
741)వీరహా-

దుష్టవీరులను అణిచినవాడు 
శత్రునిర్మూలన చేసియున్నవాడు 
అతిబలులను వంచినవాడు 
వీరులపై విజయమందినవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
742)విషయః -

సాటిలేని విషయమున్నవాడు 
గొప్పతత్వము నిండినవాడు 
అన్నియు తనలోగలిగినవాడు 
సందేహములు లేనట్టివాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
743)శూన్యః -

శూన్యము తానైయున్నట్టివాడు 
తనయందు ఖాళీగా ఉన్నవాడు 
బ్రహ్మమువలే యున్నట్టివాడు 
ఎటువంటి భావనలేనివాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా
744)ఘ్రుతాశీః -

కోరికలు వీడియున్నట్టివాడు 
సముక్తునిగా నిలిచినవాడు 
కామ్యములు లేకుండినవాడు 
ఘ్రుతాశీ యుగుచున్నవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
745)అచలః -

కదలికలు లేకుండువాడు 
శిలనుబోలి యుండినవాడు 
వస్తుతత్వము గలిగినవాడు 
అచలేశ్వరుడైనట్టి వాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )

కామెంట్‌లు