అర్ధ నారీశ్వర తత్వం;-సి.హెచ్.ప్రతాప్

 శ్లో:
చాంపేయ గౌరార్థ శరీరకాయై
కర్పూర గౌరార్థ శరీరకాయ
ధమిల్ల కాయైచ జటాధరాయ
నమశ్శివాయై చ నమశ్శివాయ (అర్ధ నారీశ్వర స్త్రోత్రంలో మొదటి శ్లోకం)
అర్థ-నారి-ఈశ్వర.....అంటే సగం స్త్రీ-సగం పురుషుడు....ఇద్దరూ కలిస్తే అర్థనారీశ్వరుడు. సృష్టిలో ప్రతీది రెండుగా ఉంటుంది. వీటినే ద్వందాలని అంతారు. పగలు-రాత్రి,చీకటి-వెలుగు, సుఖం-దుంఖం, విచారం-సంతోషం మొదలైనవి. వీటిలో ఏ రెండూ ఒకేసారి ఉండవు. ఒకటి లేకుండా మరొకటి ఉండవు. రెండింటి సమ్మేళనం ఒకటవుతుంది.   ఇలా స్త్రీ-పురుషులు కలిస్తే సృష్టి అని చెబుతుంది అర్ధనారీశ్వర తత్వం. ఒక్కచోటే ఉంటారు ఒకరికొకరు కనపడరు. కానీ ఇద్దరూ కలిస్తేనే విశేషం అన్న గొప్ప జీవిత సత్యం అర్ధ నారీశ్వర తత్వంలో నిమిడి వుంది.
అర్ధ నారీశ్వర తత్వం అంటే  స్త్రీ + పురుషుడు = సంపూర్ణ మానవుడు అనే తత్వాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన మహత్తర సత్యం. కాబట్టి స్త్రీ పురుషులు వేరు వేరుగా జన్మించినా తిరిగి వివాహం లేక మనువు ద్వారా ఒకటి అవడం ద్వారానే సంపూర్ణ మనిషిగా ద్వితీయ జన్మ   పొందుతున్నారు.  అలా మనువు వలన సంపూర్ణ మానవులు అయ్యారు కాబట్టి మనుషులను  మనువు సంతతి అన్నారు.వివాహం అనంతరం స్త్రీ పురుషులూ కూడా ఏక శరీరులుగా , ఏకాత్మ లుగా మారాలి అనేదే "అర్దనారీశ్వర తత్వం".విశ్వంలోని వ్యతిరేకతల ఐక్యతను తెలియజేస్తుంది. పురుషుడు సగం పురుషుడు మరియు స్త్రీ సగం ప్రకృతి. అర్ధనారీశ్వరుడు రెండు విరుద్ధమైన జీవన విధానాలను సమన్వయం చేస్తాడు: శివుడు సూచించే సన్యాసి యొక్క ఆధ్యాత్మిక మార్గం మరియు పార్వతి ద్వారా సూచించబడిన గృహస్థుని భౌతిక మార్గం. ఇది శివుడు మరియు శక్తి ఒక్కటే అని తెలియచేస్తుంది.

కామెంట్‌లు