686)పూరయితా -
సంపూర్ణమైన శుభప్రసాదకుడు
ఆశ్రయించినవార్ని బ్రోచువాడు
భక్తులకు క్షేమము నింపువాడు
సంపూర్ణమైన దివ్యత్మమున్నవాడు
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
687)పుణ్యః -
పుణ్యస్వరూపము గలిగినవాడు
ధార్మికత నిండియున్నట్టివాడు
పవిత్రములైన కర్మాచరణుడు
సుకృతితో భాసించుచున్నవాడు
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
688)పుణ్యకీర్తి-
పవిత్రమైన కీర్తిగలిగినవాడు
ధార్మికత నిండినట్టి దివ్యుడు
సుకృతమున్న పేరుగలవాడు
పుణ్యాత్మునిగా యశమున్నవాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
689)అనామయః -
ఏవిధమైన రుగ్మతలేనివాడు
శారీరక బలమున్నట్టివాడు
మానసిక లోపములులేనివాడు
అనామయుడై యుండినవాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
690)మనోజనః -
మనసువలే అతివేగవంతుడు
భావనలు సృష్టించగలవాడు
శరవేగమైన బుద్ధిగలవాడు
మనోజమైనట్టి ఊహగలవాడు
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
(సశేషం )
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి