సాహితీ యుగకర్త;- :- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 
వక్త ,ప్రవక్త , యుగకర్త  సి నా రె
సినిమాపాటల సినీవాలి
పదాలకు ప్రాసనేర్పిన పండితుడు
ప్రామాణిక పరిశోధనలో ప్రజ్ఞాని
గేయాలతో మనసుగాయాలు మాన్పే వెజ్జు
పైన కఠినమనిపించినా లోన వెన్నకనిపించే మనీషి
అక్షరాలను అనేకరకాలుగా ఆడించిన అక్షరమాంత్రికుడు
పాటలుగా, కవితలుగా,గజళ్ళుగా, కావ్యఖండికలుగా,
కథలుగా,నవలలుగా, వ్యాసాలుగా, సిద్ధాంతవ్యాసాలుగా
విరచించి తనమాటలను అందలమెక్కించాడు
అక్షరాలతో నక్షత్రరహదారి నిర్మించి
మన మనసులకు కవిత్వపుతోటలు దర్శింపజేశాడు
కవితలను జ్ఞానపీఠమెక్కించి
కాలంపొడవునా ప్రవహిస్తున్నాడు
తెలుగుభాషలోని మజాను
భూగోళంపై తనసాహిత్యసంతకంగా చేశాడు
ఎన్నియుగాలైనా ఇగిరిపోని
సాహితీగంధాన్ని మనకు అలదినాడు
ఈతని రచనలను ఆనందించిన ప్రతిఒక్కరూ
ఆహా!ఏమిరా!సినారె ఏమిరాసినారె!
అన్నారు మరి!!!
*****************************************


కామెంట్‌లు