696)వసుః -
సర్వులకూ శరణ్యమైనవాడు
గణదేవతల్లో నిలిచినవాడు
కిరణసహితునిగా యున్నవాడు
మధురమైనట్టి మనసున్న వాడు
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
697)వసుమనాః -
సర్వత్రా వ్యాపించియున్నవాడు
సమమనస్సు వున్నట్టివాడు
బంగారం వంటి హృదయమున్నవాడు
ధన, రత్నములు గలిగినవాడు
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
698)హవిః -
హవిస్సులందుకొనుచున్నవాడు
దేవతార్పణము చేయుచున్నవాడు
అగ్నిలో నెయ్యిసమర్పించువాడు
పవిత్రము అయివున్నవాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
699)సద్గతిః -
సజ్జనుల పరమగతైనవాడు
భక్తులను గమ్యం చేర్చునట్టివాడు
పరమపదము నొసగువాడు
సద్గతిని ప్రసాదించగలవాడు
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
700) సత్కృతిః -
జగత్కళ్యాణకారణమైనవాడు
ఉత్తమ కార్యములు చేయువాడు
సత్కర్మలను ఆచరించువాడు
సద్గురువుగా తగియున్నవాడు
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి