శ్రీ ఆదిశంకరాచార్య;- కొప్పరపు తాయారు
వేదాంత జ్యోతులతో 
వెలుగు నింపిన అద్వైత 
వేదాంత సిద్ధాంతవేత్త
ఏకీకృతం చేసిన భారతీయ 

తత్వవేత్త పిన్న వయసున
పండిన సిరిమల్లె మొగ్గ 
నీ గుబాళింపులు మహిని
శివుని అంశంతో జన్మించిన 

శివరూప శ్రీ శంకరాచార్య 
 కారణజన్మ కలికితురాయి 
భక్తి మార్గముపదేశింప
దారి చూప, అవతరించినావు

అందరి కోసం ఆ సేతు 
హిమాలయముల నుండి 
కన్యాకుమారి వరకు 
పాదయాత్రలు సలిపిన

 పరమశివుని భక్తుడా 
అమ్మనే శ్రీ చక్రమున 
బంధించిన మహిమాన్విత 
జాతక చక్రం, చిన్న వయసున

పెద్ద కార్యక్రమాలు, అమోఘంగా 
సల్పిన అపర దైవమా 
కాపాడు మా, గావుమా 
ఓ ఆదిశంకరాచార్య 
నమోన్నమః ! నమో నమః !!!

కామెంట్‌లు