నా మనసు ;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
గాలిలా
వ్యాపించమంటుంది

కాంతిలా
ప్రసరించమంటుంది

నీటిలా
ప్రవహించమంటుంది

ఆకాశంలా
ఎత్తుకెళ్ళమంటుంది

పుడమిలా
ప్రాణులకుతావుకమ్మంటుంది

పువ్వులా
పూయమంటుంది

నవ్వులా
వెలిగిపొమ్మంటుంది

ఆలోచనలలా
సాగిపొమ్మంటుంది

భావాలలా
బహిర్గతముకమ్మంటుంది

అక్షరాలై
అలరించమంటుంది

పదాలై
పరవశపరచమంటుంది

అందమై
ఆకర్షించమంటుంది

ఆనందమై
అంతరంగంలోనిలువమంటుంది

కవిత్వమై
కమనీయతనివ్వమంటుంది

మనసుకోరిక
మన్నించుతున్నా

మదినివిప్పి
ముందుంచుతున్నా


కామెంట్‌లు