సినీగీతాల రారాజు సిరివెన్నెల;- ఆచార్య అయ్యలసోమయాజుల ప్రసాద్(పుష్యమి) విశాఖపట్నం.
ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుగా ఆటో ఇటో  ఏటో వైపు  అని 
విధాత తలపున ప్రభ వించినది అనాది జీవన వేదం అని 
అపురూపమైనదమ్మ ఆడజన్మ 
ఆజన్మకు పరిపూర్ణత  ఇల్లాలమ్మ అని
పాటల పల్లకివై ఉరేగే చిరుగాలి
కంటికి కనపడవే నిన్నెక్కడ వెతకాలి అని

కళ్ళలోకి కళ్ళు పెట్టి చూడవెందుకు చెప్పలేని గుండె కోత పోల్చుకొందుకు అని
మేరా భారత్ కో సలాం ప్యారా భారత్ కో ప్రణాం అని
నిగ్గదీసి అడుగు ఈ సిగ్గు లేని జనాన్ని
అగ్గితోటి కడుగు ఈ సమాజ జీవచ్చావాన్ని
మారదు లోకం మారదు కాలం అని

జగమంత కుటుంబం నాది ఏకాకి జీవితం నాది అని
మధురమైన, మరపురాని
ఎన్నో ఎన్నెన్నో గేయాలను రచించి
తెలుగు చిత్రసీమలో పదుకొండు నంది పురస్కారాలు
నాలుగు ఫిల్మ్ ఫేర్ అవార్డులకే గాక
భారతప్రభుత్వపు అత్యున్నత  పద్మశ్రీ పురస్కారానికే
వన్నె తెచ్చిన
సినీగీతాల రారాజువై నిలిచిన
చిన్ననాటి స్నేహితుడా  అర్ధాంతరంగా ధరణిని వీడిన భరణి
మొదటి సినిమానే ఇంటిపేరుగా మారి
కళాతపస్వి విశ్వనాథుని మానసపుత్రుడివైన
సిరివెన్నెల 
నీవు సదా స్మరణీయుడివే
అందుకో నీ పాటలతోనే
నా అక్షర కుసుమాలు......
.............................
(బాల్య స్నేహితుడు సిరివెన్నెల జయంతి మే 20 సంధర్భంగా)


కామెంట్‌లు