ప్రముఖ కవి "కావ్యసుధ " కు " ఆధ్యాత్మిక సాహితీ వ్యాస భూషణ్ " బిరుదు ప్రధానం
 స్నేహం మంజరి, పశు సంవర్ధిని, సీనియర్ సిటిజన్స్ వాణి మాస పత్రికల వ్యవస్థాపకులు, సంపాదకులు శ్రీ పునుకొల్లు సత్యనారాయణ  సారథ్యంలో వెలువడే పత్రికల వార్షికోత్సవ సభ ఆదివారం మచిలీపట్నంలో శ్రీ నిలయంలో ఘనంగా జరిగింది.
తెలుగు భాషాభివృద్ధికి సాహితీ మూర్తులు దశాబ్ద కాలంగా, అందిస్తున్న సహకారం, ప్రోత్సాహం వెలకట్టలేనిది.
 
ఐదున్నర దశాబ్దల తెలుగు సాహితీ లోకంలో, నేటికీ దాదాపుగా 130 దిన, వార, పక్ష, మాస పత్రికల్లో..వివిధ ప్రక్రియల్లో తెలుగు భాష కళామతల్లికి సేవలు చేసిన... చేస్తున్నా , రెండు తెలుగు రాష్ట్రాలలోని పురాతనమైన దేవాలయాల గూర్చి విస్తృతంగా పరిశోధన వ్యాసాలు అందిస్తున్న సేవలను గుర్తించి ప్రముఖ కవి, ఆధ్యాత్మిక వ్యాస రచయిత, 'వాజ్ఞ్మయ భూషణ' సాహితీ సేవా రత్న అవార్డు గ్రహీత, ఆధ్యాత్మిక సాహిత్య సామ్రాట్, సీనియర్ జర్నలిస్ట్, అపారమైన సాహిత్య కళాభిరుచి గల 
శ్రీ " కావ్యసుధ " కు మచిలీపట్నం సీనియర్ సిటిజన్స్ వాణి వార్షికోత్సవ సభలో  సంపాదకులు పత్రికా శిఖామణి శ్రీ పునుకొల్లు సత్యనారాయణ గారు  " ఆధ్యాత్మిక సాహితీ వ్యాస భూషణ్ " బిరుదు ప్రధానం చేసి    శాలువా,మెమెంటో,ప్రశంసా పత్రముతో ఘనంగా సత్కరించారు.
 "కందపద్య కవి సార భౌమ" డాక్టర్ "రాధశ్రీ " గారు తన పద్య రచనలతో శ్రావ్యంగా సభను నడిపించి రాగ రంజితం చేశారు.
తనకు జరిగిన సన్మానానికి స్పందిస్తూ... దశాబ్దాల... ప్రాచీనమైన... గుళ్ళూ...గోపురాల గూర్చి... విస్తృతంగా...విపులంగా... సచిత్రాలతో విజ్ఞాన దాయకంగా లోతైన పరిశోధన చేస్తున్నా,నా ఆధ్యాత్మిక సేవలను గుర్తించి...ఘనంగా....
సన్మానించిన పెద్దలందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియజేశారు.

కామెంట్‌లు