అమృతం - కొప్పరపు తాయారు
దేవుడు అమ్మని సృష్టించ
అమృతపు చుక్కను 
ఒలిగించాడు భూమిపైకి 
అదృష్టం అమ్మగా మారే

అందుకే అంత కమ్మదనం 
అమ్మ అన్నమాట ప్రతి నోటా 
జన్మించినది మొదలు 
ఆ శబ్దమే జపం, ఆవు 

అంబా అన్న, అదే ఆర్తి 
పసిపాపలన్న, ప్రాణాలు లేచి 
పరిగెత్తు నెచటికో,
ఎంత అదృష్టం దేవుడు 

మహిమాన్వితుడు ఎంచి 
ఆలోచించి మంచి ఆధారం. 
ఆలంబన, ప్రేమాభిమానం 
ఆప్యాయత అనురాగం 

కలబోసి కళ కళ లాడే అమ్మని 
మనకు ఆదరించి ఇచ్చాడు 
అందుకే ఆనందంలోనైనా
 బాధలోనైనా,సంతోషంలోనైనా 
ఒకే ఒక శబ్దం అమ్మా! అదే అమ్మ 

రెండు పెదవుల కలయిక 
ఆత్మీయతా పిలుపులో 
కదులు హృదయం, తీపి గుర్తుగా 
చెమర్చు కనులు,ఎంత అదృష్టం 

మా అమ్మ వరాల పంట 
భగవంతుని ప్రతిరూపం 
అమ్మ అమ్మే సాటి లేరు !!!


కామెంట్‌లు