పరిహారము లేదు;- :- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 కరి మకరి తోడ
పోరిన విధముగా
హరి నరహరిగా
మారిన విధముగా
గిరి తనయ
కరి వసనుని
కోరి  వటువు
పరిచర్యలు చేసినట్లు
పరిపరి విధముల
హరి స్మరణను
కోరి కోరి చేయుము
సరిగాదు దేనికి
పరిహారము లేదు
హరి హరులను
మరిచిన వారికి ఇలలో
కరి వదనుని సాక్షిగా!
**************************************

కామెంట్‌లు