కృష్ణమ్మ సొగసులు;- ఎడ్ల లక్ష్మి సిద్దిపేట
అడవి పూల చీర కట్టింది
నట్ట నడుమ కృష్ణమ్మ రంగు
ఆకాశ నీలి వర్ణములో ఉంది
కృష్ణమ్మ చూడ చక్కగుంది !!

కృష్ణా నదికి రెండు దిక్కుల
అందమైన అడవి ఆవతీగ
ఊదారంగులో పూలు పూసి
కృష్ణానది అందం పెంచింది !!

విరబూసిన కుసుమాలతో
కిల కిల నవ్వుతుంది కృష్ణమ్మా
చూసే కనుల కెంతో యింపుగా
కనబడుతుంది ఆ పూల వనం !!
 
పరుచుకుని పారిన మొక్కకు
ఎన్నో ఔషధ గుణాలుంటాయి
చుట్టుకుని పారిన ఆ పుష్పం జాతి తీగ
కృష్ణా తీరానికి శోభన్ తెచ్చింది !!


కామెంట్‌లు