ఇక సెలవు;- గుండ్లపల్లి రాజేంద్రప్రసాద్, భాగ్యనగరం
ఓటమిని
ఒప్పుకుంటున్నా
విదేశానికి
వెళ్ళిపోతున్నా

పేచీ
పెట్టనంటా
కుర్చీ
దిగిపోతున్నా

పెత్తనం
వదులుతున్నా
పలాయనం
చిత్తగిస్తున్నా

ఓటుదెబ్బకు
లొంగిపోతున్నా
చాటుమాటుకు
వెళ్ళిపోతున్నా

తిట్టులు
తిట్టవద్దు
దెబ్బలు
కొట్టవద్దు

బుద్ధి
వచ్చింది
తప్పు
తెలిసింది

మౌనం
వహిస్తా
మానం
కాపాడుకుంటా

మాటలు
మీరవద్దు
తూటాలు
ప్రేల్చవద్దు

టాటా
చెబుతున్నా
బైబై
చెప్పుతున్నా

దుర్భాషలు
ఆడవద్దు
ఇకసెలవు
చిత్తగించవలెను


కామెంట్‌లు