నూతన పద్యప్రక్రియ ఉషస్సూర్యపదిని రూపొందించిన రచయిత్రి ధనాశి ఉషారాణి
 తిరుపతి జిల్లా చిన్నగొట్టిగల్లు మoడలము భాకరాపేటకు చెందిన  
 ఉషోదయ ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు ఉషోదయ ఫౌండేషన్  ఆధ్వర్యంలో నూతన పద్య పక్రియను రూపొందిoచినారు.
రి. నెo 123/2023  గతములో అనేక పక్రియలు  రూపొందించి ఉమ్మడి తెలంగాణ ఆంద్రప్రదేశ్ రాష్ట్రముల్లో అనేక  శతకములును రాయించడము జరిగింది.వానిలో సిరిమoజరి రాగగీతి రాఘజరి పంచరవళి పద్యచంద్రిక సోయగము వంటి ప్రక్రియలులో శతక పద్యాలును రాయించడము జరిగింది. పద్య సాహిత్యం మరుగున పడుతూ వచన సాహిత్యంలో కొత్త పుంతలును తొక్కుతూ ఉన్న నేటి తరుణంలో పద్యాలుకు ప్రాణము పోస్తూ ముందుకు సాగుతున్నారు.నూతన పద్య ప్రక్రియల్లో సాహితీ లోకములో చెరగని ముద్రను వేస్తున్నట్టు అందరి మన్ననలను అందుకుంటున్నారని సాహితి వేత్తలు చెబుతున్నారు
ఉషస్సూర్యపది
పద్య నియమాలు
నాలుగు పాదములు ఉంటాయి
ఇది పూర్తిగా పద్య పక్రియ
ప్రతి పాదములో వరుసగా నాలుగు సూర్య గణములు ఉంటాయి
3 మరియు 4 పాదములకు ప్రాస నియమo కలదు
మొదటి మరియు 2 పాదములో పదవ అక్షరoకుయతి మైత్రి ని కూర్చాలి
ఉషస్సూర్యపది 
కలము తోడు పాడి పలుక
మనసు లోని ప్రేమ తరమ
వలపు తోడు నిల్చు తలపు*       
ఇలను జూడ వెలుగు కలుపు
                             
 జయముపొంద శుభమువరుస
  మేలు జేయ తలవు శుభమె
 అవని కీడు నెంచ తలవ
నెవరి కైన సబబు కాదు
100 రాసిన కవి శ్రేష్టులకు ఉషస్సూర్యపది మయూరి బిరుదు
200 రాసిన కవి శ్రేష్టులకుఉషస్సూర్యపది కిరీటి బిరుదును ఇవ్వనున్నారని తెలియజేసారు.ఇందులో వేణుగోపాల్ శర్మ కాసర్ల రామచంద్రo గారు 
మట్ట సూర్యనారాయణ కూని అంకబాబు తిరుపతి రావు గండ్రేటి రత్నం ప్రక్రియలో పద్యములు రాస్తున్నవారిలో ఉన్నారు.
(ప్రతి కవిని మెమెంటో సర్టిఫికెట్ తోను శతపద్యములు పూర్తిచేసాక సన్మానించబడునని రచయిత్రి సంఘ సేవకురాలు ధనాసి ఉషారాణి తెలియజేశారు.

కామెంట్‌లు