ధర్మో రక్షతి రక్షితః...! - కోరాడ నరసింహా రావు.

 ఈ వెలుగు లన్నీ మలిగి పో వలసినవే...! 
  ఆ చీకట్లూ... తొలగి పో వల సినవే...!! 
 అనివార్వమై  కొనసాగే... 
 ఈ నిరంతర సహజ ప్ర క్రియకు
  ఆందోళన చెంది, ఆవేదన పడ ట మెందుకు...!? 
   అసత్యపు మబ్బులో... 
 సత్యాన్ని చూడ లేకపోబట్టే.! 
 ఏదీ  నువ్వు కావాలను కున్నా వని జరగటం లేదు...., 
 నువ్వొద్దను కున్నావనిఆగిపోదు..!! 
 నీది కాని కర్త్రుత్వ భావాన్ని
  నీకు నువ్వు ఆపాదించు కోకు
 ఫలితాలకు బాధ్యత వహించ వలసి వ స్తుంది...! 
 అవి వాటి సుఖ, దుఃఖాలకు
  నిన్ను బలి చేస్తాయి...!! 
  నీవు కేవల సాక్షీ భూతుడవు.! 
  అంతే కాదు... 
  నీవు కేవలము ఏదో ఒక వర్గము తరపున 
వకాలతా పుచ్చుకుని వాదించే లాయరువు (లయ్యరు) కావు.! 
 ఇరు వైపుల వాదనలూ విని న్యాయాన్ని చెప్పాల్సిన న్యాయ మూర్తివి...!! 
  నిర్మొహ మాటముగా.... 
  నిష్పక్ష పాతముగా... 
 సాక్ష్యానికి నిలబడటమువరకేనీ పని...! 
  నీపని నువ్ చెయ్ .... 
 ధర్మో రక్షతీ  రక్షితః...! 
   *******
కామెంట్‌లు