శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )-ఎం. వి. ఉమాదేవి
766)చతుర్బాహుః -

నాల్గుచేతులు కలిగినవాడు 
చతుర్భుజమూర్తి యైనట్టివాడు 
శంఖచక్రములు ధరించినవాడు 
సంపూర్ణమూర్తిత్వం గలవాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
767)చతుర్వ్యూహః -

నాల్గువ్యూహములు తెలియువాడు 
వేదజ్ఞానం తెలుపగలవాడు 
శరీరవ్యూహం నడుపువాడు 
మహా ఛందోరూపున్నవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
768)చతుర్గతిః -

నాల్గు విధాల ఆశ్రయమిచ్చువాడు 
అందరికి గతియైనట్టివాడు 
ధర్మార్థముల నొసగుచున్నవాడు 
కామమోక్షములగతియైనవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
769)చతురాత్మా -

సమర్థుడై యున్నట్టివాడు 
చాతుర్యము గలిగినవాడు 
ఆత్మయందు జ్ఞానమున్నవాడు 
కార్యక్రమము నడిపించువాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
770)చతుర్భావః -

పురుషార్థములకు కారకుడు 
చతుర్భావకుడైనట్టి వాడు 
కర్మలకు మూలమై యున్నవాడు 
కర్తవ్యం బోధించుచున్నవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )

కామెంట్‌లు