తేటగీతి పద్యములు.
==============
16.
తల్లి ప్రేమకై చింతించి ధరణి చేరి
చిన్నవై యశోదను జేరి శిశువు వోలె
నాడుకొంటివి ప్రేముడి నాదమరచి
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//
17.
ఆలమందల కాచిన యందగాడ!
యదుకులంబున జనియించి యవని యందు
కృపను చూపిన పరమాత్మ కేలు బట్టి
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//
18.
దురితదానవ బృందము దునిమి నీవు
వీర కంసుని వధియించి వినుతి కెక్కి
వెన్న ముద్దలన్ మ్రింగెడి వన్నెకాడ!
నన్నుపాలింపు మాల్యాద్రి నారసింహ!//
19.
గొల్లపల్లెల గోవులన్ గూర్మి తోడ
కాచుకొన్నట్టి నీ దివ్య కథలు వింటి
పశువు నన్ గాచుమయ్యరో!పరవశింతు
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//
20.
గురుసుపుత్రుని కాపాడి గురుతరముగ
బాధ్యతను జూపి గురుపత్ని బాధతీర్చి
మేలొనర్చిన దేవర దేవత!దాలిమిమెయి
నన్నుపాలింపు మాల్యాద్రి నారసింహ!//
==============
16.
తల్లి ప్రేమకై చింతించి ధరణి చేరి
చిన్నవై యశోదను జేరి శిశువు వోలె
నాడుకొంటివి ప్రేముడి నాదమరచి
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//
17.
ఆలమందల కాచిన యందగాడ!
యదుకులంబున జనియించి యవని యందు
కృపను చూపిన పరమాత్మ కేలు బట్టి
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//
18.
దురితదానవ బృందము దునిమి నీవు
వీర కంసుని వధియించి వినుతి కెక్కి
వెన్న ముద్దలన్ మ్రింగెడి వన్నెకాడ!
నన్నుపాలింపు మాల్యాద్రి నారసింహ!//
19.
గొల్లపల్లెల గోవులన్ గూర్మి తోడ
కాచుకొన్నట్టి నీ దివ్య కథలు వింటి
పశువు నన్ గాచుమయ్యరో!పరవశింతు
నన్ను పాలింపు మాల్యాద్రి నారసింహ!//
20.
గురుసుపుత్రుని కాపాడి గురుతరముగ
బాధ్యతను జూపి గురుపత్ని బాధతీర్చి
మేలొనర్చిన దేవర దేవత!దాలిమిమెయి
నన్నుపాలింపు మాల్యాద్రి నారసింహ!//
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి