విద్యాహక్కు పరిరక్షణ ;-సి.హెచ్.ప్రతాప్
 ఆర్థిక, సామాజిక మరియు సాంస్కృతిక హక్కులపై అంతర్జాతీయ ఒడంబడికతో సహా అనేక అంతర్జాతీయ సమావేశాలలో విద్యాహక్కు మానవ హక్కుగా గుర్తించబడింది, ఇది అందరికీ ఉచిత , ప్రాథమిక విద్య హక్కును, అందరికీ అందుబాటులో ఉండే మాధ్యమిక విద్యను అభివృద్ధి చేయవలసిన బాధ్యతను గుర్తిస్తుంది.  మానవ హక్కుల సార్వత్రిక ప్రకటనలోని ఆర్టికల్ 26లో విద్యా హక్కు ప్రతిబింబిస్తుంది , ఇది ఇలా పేర్కొంది:
"ప్రతి ఒక్కరికీ విద్యనందించే హక్కు ఉంది. కనీసం ప్రాథమిక మరియు ప్రాథమిక దశలలో విద్య ఉచితంగా ఉండాలి. ప్రాథమిక విద్య తప్పనిసరి. సాంకేతిక మరియు వృత్తిపరమైన విద్య సాధారణంగా అందుబాటులోకి తీసుకురాబడుతుంది మరియు ఉన్నత విద్య అందరికీ సమానంగా అందుబాటులో ఉంటుంది. యోగ్యత మానవ వ్యక్తిత్వం యొక్క పూర్తి వికాసానికి మరియు మానవ హక్కులు మరియు ప్రాథమిక స్వేచ్ఛల పట్ల గౌరవాన్ని బలోపేతం చేయడానికి ఉద్దేశించబడింది, ఇది అన్ని దేశాలు, జాతి లేదా మత సమూహాల మధ్య అవగాహన, సహనం మరియు స్నేహాన్ని ప్రోత్సహిస్తుంది. శాంతి పరిరక్షణ కోసం ఐక్యరాజ్యసమితి తమ పిల్లలకు ఎలాంటి విద్యను అందించాలో ఎంచుకోవడానికి తల్లిదండ్రులకు ముందస్తు హక్కు ఉంది.


ప్రపంచంలో సుమారు 80కోట్ల మంది నిరక్షరాస్యులు ఉండగా అందులో 23.8 కోట్ల మంది మన దేశం లోనే ఉన్నట్లు ఇటీవల ఐక్య రాజ్య సమితి తన నివేదికలో వెల్లడించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ వయసు పిల్లలు 92 లక్షల మంది పాఠశాల చదువులకు వెలుపలే ఉండిపోతున్నారు. పాఠశాలల్లో చేరని, లేదా మధ్యలోనే చదువు మానేసిన వీరందరినీ తిరిగి చదువుల బాట పట్టించడం విద్యాహక్కు చట్టం ముఖ్యోద్దేశం. విద్యను బాలల ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూ 2009 సంవత్సరంలో విద్యా హక్కు చట్టం చేశారు. ఉపాధి హామీ పథకం, సమాచార హక్కు చట్టాల తరహాలో ఇది అమలు చేయాలి. 6-14 ఏళ్ల మధ్య వయసు బాలబాలికలందరూ తప్పనిసరిగా పాఠశాలల్లో చేరి చదువుకునేలా చూస్తూ, వారికి ఉచిత విద్య అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీద ఈ చట్టం వుంచింది. అదేవిధంగా ప్రైవేటు విద్యాసంస్థలలో ఆర్థికంగా వెనుకబడిన బలహీన వర్గాలకు 25% రిజర్వేషన్లు కల్పించాలని నిర్దేశించింది.  ఐక్యరాజ్య సమితి తాజా నివేదిక ప్రకారం దేశంలో విద్యా హక్కు చట్టం సక్రమంగాశ్ అమలవడం లేదని స్పష్తమౌతొంది. తెలుగు రాష్ట్రంలో సగటున  విద్యార్థుల అడ్మిషన్లను ప్రభుత్వ పాఠశాలలతో పోలిస్తే ప్రైవేటు పాఠశాలలో 52% అధికంగా ఉంది. ప్రైవేటు విద్యాసంస్థలలో ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు కల్పిస్తున్న 25% రిజర్వేషన్లు అమలు కావడం లేదని అనేక ఆరోపణలు వస్తున్నాయి. రిజర్వేషన్ల అమలు పర్యవేక్షణకు సరైన అధికార యంత్రాంగం లేదు.రాజ్యాంగం నిర్దేశించినట్లు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రైవేటు పాఠశాలల్లో ప్రాథమిక విద్య నుండి సెకండరీ విద్య వరకు నిరుపేదలకు 25% రిజర్వేషన్లు పకడ్బందీగా అమలు చేసి పేద బాల బాలికలకు నాణ్యమైన విద్యను అందించవలసిన అవసరం ఉంది.

కామెంట్‌లు