శ్రీ విష్ణు సహస్రనామాలు (బాల పంచపది )ఎం. వి. ఉమాదేవి
781)దురారిహాః -

దుష్టమానవుల హరించువాడు 
దురాత్ములను అణుచువాడు 
శత్రువులను ఖండించగలవాడు 
దుష్ట సంహారము జేయువాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
782)శుభాంగః -

దివ్యములైన అంగములున్నవాడు 
సుందరమైన ఆకృతిగల వాడు 
మంచి శరీరమున్నట్టి వాడు 
స్ఫురద్రూపంలో యుండినవాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
783)లోక సారంగః -

లోకములోని సారమైనవాడు 
సారాంశం గ్రహించినవాడు 
అవలోకనము చేయగలవాడు 
చర్యలను చేపట్టినట్టి వాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!
784)సుతంతుః -

జగద్రూపంలో నున్నట్టివాడు 
తంతువువలే విస్తరణగువాడు 
అందమైన రూపుగలిగినవాడు 
సుతంతువగుచు భాసిల్లువాడు 
శ్రీ విష్ణు సహస్రనామాలు ఉమా!
785)తంతు వర్థనః -

జగత్తును వృద్ధిపరచువాడు 
విశ్వనాశనము చేయగలవాడు 
ఘటనలకు సమర్థుడైనవాడు 
ఇచ్ఛాపూర్వకముగా నుండువాడు 
శ్రీవిష్ణు సహస్రనామాలు ఉమా!

(సశేషం )

కామెంట్‌లు