యువతా మేలుకో!- :- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
భారతీయ యువతా
మేలుకో మరిక
మాదకద్రవ్యాల వాడుక
మానుకో చాలిక
తల్లిదండ్రి బంధుగణం
దేశకాల వాతావరణం
అంతా అంతా నాశనమేగా
నీ జీవితం ఎడారేగా
నిర్వీర్యం నిస్సత్తువ నిను ఆక్రమించి
భావి అంత మంట గలుపు నీనుంచి
చదువు సంస్కారం విలువ వలువ
ఊడిపోవు మరిక తలువ
కీర్తి మూర్తిమత్వ మంత
ఆయురారోగ్యాల క్షీణింత
దయనీయ పరిస్థితి
నిలువరించు నీ స్థితి
ఇకనైనా మేలుకో
మాదకాలు వదులుకో
ఉచ్చును చీల్చుకో
పులుగడిగిన ముత్యంలా
ప్రకాశించు జగమంతా!!
**************************************
 

కామెంట్‌లు
Joshi Madhusudana Sharma చెప్పారు…
బాగుంది కవిత. అభినందనలు సార్ 🌹🙏🌹