ఆదరించండి!!!-సునీతా ప్రతాప్ ఉపాధ్యాయిని పాలెం.
భూమిపై కాలు మోపగలం కానీ
ఆకాశాన్ని కాలుతో తన్నలేము!!
ఆకాశాన్ని చూడగలం కానీ
ఆకాశాన్ని చిన్నచూపు చూడలేము!!?

నక్షత్రాలను చూడగలం కానీ
నక్షత్రాలని అందుకోలేము.!!
ఆకాశంలోంచి వచ్చిన మనిషికి
అవకాశాలు ఉన్నా లేకున్నా చులకన చేయకూడదు.!!?

విశ్వంలో కోట్ల సూర్యులున్నా కోట్ల చంద్రులు ఉన్నా
ఒకే ఒక సూర్యున్ని ఒకే ఒక చంద్రుని చూస్తున్నాం.!!

మనుషుల్ని అవమానించకండి మనుషుల్ని ఆదరించండి.
అందర్నీ సమానంగా చూడండి.!!

కామెంట్‌లు