తిరుపతిలో ఈనెల 16 నశ్రీ శ్రీ కళావేదిక 135 వ జాతీయ శతాధిక కవి సమ్మేళనం
 ఐ యస్ ఓ గుర్తింపు పొందిన అంతర్జాతీయ సాహిత్య  సాంస్కృతిక సంస్థ శ్రీ శ్రీ కళా వేదిక డా.కత్తిమండప్రతాప్ గారి ఆధ్వర్యములో  ప్రముఖ రచయిత్రి శ్రీ శ్రీ కళా వేదిక రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శి డా. ధనాసి ఉషారాణి నిర్వహణ లో తిరుపతిలో జూన్ 16 తేదీన యస్వీ యూనివర్సిటీ డీ బ్లాక్ ఆడిటోరియo నoదు డైరెక్టర్ ఆఫ్ స్టూడెంట్ వెల్ఫేర్ అండ్  కల్చరల్ అఫైర్స్ మరియు శ్రీ శ్రీ కళా వేదిక సంయుక్త నిర్వహణలో తిరుపతి కవితోత్సవo  పేరుతో జాతీయ శతాధిక కవి సమ్మేళనంను నిర్వహింస్తున్నట్టు ఆంధ్రప్రదే రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శి డా. ధనాసి ఉషారాణి తెలియజేసారు. వివిధ పద్య ప్రక్రియలకు రూపకర్తగా అనేక పద్యములను రాయిస్తూ అనేక సాహితీ కార్యక్రమాలును నిర్వహిస్తూ ఉన్న నేపధ్యంలో పద్య చంద్రిక పుస్తక ఆవిష్కరణను ప్రముఖులుగా విచ్చేయనున్న డా.కత్తిమండ ప్రతాప్ శ్రీ శ్రీ వేదిక అంతర్జాతీయ ఛైర్మెన్ మరియు కన్వీనర్ కొల్లిరమావతి మరియు ఈశ్వరీ భూషణo హరి సర్వోత్తమ నాయుడు  చిట్టెలలిత పార్థసారథి సంపత్ కుమార్ గుండాల రాకేష్  చేతులు మీదుగా ఆవిష్కరణ చేయనున్నారు.జాతీయ శతాధిక కవి సమ్మేళనం లో 150 మంది ప్రముఖ కవులు పాల్గొననున్నారని ప్రత్యేకoగా కరాటి కూచిపూడి నృత్య ప్రదర్శనతో కవుల్లో ఆకర్షణీయమైన కార్యక్రమంగా సాహిత్యంకు పట్టo కట్టే విధముగా పోగ్రము ఉంటుందని నిర్వహకురాలు ధనాసి ఉషారాణి తెలియజేశారు .ఐదు రాష్ట్రముల నుండి కవులు పాల్గొననున్నారని  సమాజిక అంశాలతో సాహిత్యంకు వన్నెతెచ్చే విధముగా ఉంటుందని తెలియజేసారు.ప్రొఫెసర్ మురళీధర్ గారు ప్రొఫెసర్ మమత ఆచార్య తరపట్ల సత్యనారాయణ ప్రొఫెసర్ మధుజ్యోతి విశ్రాంతి ప్రొఫెసర్ కుసుమకుమారి మాడభూషి సంపత్ కుమార్  రావడముతో 135వ జాతీయ శతాధిక కవి సమ్మేళనం తిరుపతిలో సాహితీ చరిత్రలో సువర్ణ అధ్యాయంలా నిలిచిపోతుందని శ్రీ శ్రీకళా వేదిక ఛైర్మెన్ కత్తిమండ ప్రతాప్ ఆనందమును వ్యక్తముచేశారు. కార్యక్రమo నిర్వహకురాలు డా .ధనాసి ఉషారాణి కవులందరూ పాల్గొని విజయవంతo చెయ్యాలిసిందిగా కోరారు.ఇందులో భాగముగా తిరుపతిలో కొందరు ప్రముఖులను కరపత్రములు అందించి ఆహ్వానము పలికారు వారిలో ఆకాశవాణిలో వ్యాఖ్యనము చేయు సుదాకరు నిర్మల గారు ప్రముఖ అవదాని మేడసాని మోహన్ గారు వున్నారు. ఆడపిల్లల ను కాపాడుతూ సమాజ సేవకురాలు స్పెషలు బ్రాoచు సుమతి గారిని ఆహ్వానము పలికారు. అలాగే విసి కుసుమ కుమారిని భూమన గారిని జాతీయ పోగ్రాముకు ప్రత్యేకముగా పిలవడము జరిగిందని నిర్వాహకురాలు ధనాసి ఉషారాణి తెలియజేశారు.ఇలాంటి గొప్ప కార్యక్రమము పట్ల సాహితీ వేత్తలు ఆనoదము తెలియజేశారు


కామెంట్‌లు