*కూరల పాట*;- రమాదేవి బాల బోయిన-7893261262
కూరలమ్మా కూరలూ
కూరగాయల కూరలూ
ఎర్ర ఎర్రగుంటదీ-
తింటె పుల్లగుంటదీ
ఏంటదీ ఏంటదీ??

కూరలమ్మా కూరలూ
కూరగాయల కూరలూ
ఎర్రఎర్రగుంటదీ-
తింటె పుల్లగుంటదీ
టమాటా-కూరదీ

కూరలమ్మా కూరలూ
కూరగాయల కూరలూ
పచ్చపచ్చ గుంటదీ
తింటే మండుతుంటదీ
ఏంటదీ ఏంటదీ?

కూరలమ్మా కూరలూ
కూరగాయల కూరలూ
పచ్చపచ్చ గుంటదీ
తింటే మండుతుంటదీ
మిరపకాయ కూరదీ

కూరలమ్మా -కూరలూ
కూరగాయల కూరలూ
బొట్లుబొట్లు గుంటది
తింటె చేదుగుంటదీ
ఏంటదీ-ఏంటదీ??

కూరలమ్మా కూరలూ
కూరగాయల కూరలూ
బొట్లుబొట్లు గుంటది
తింటె చేదుగుంటదీ
కాకరకాయ కూరదీ

కూరలమ్మా -కూరలూ
కూరగాయల కూరలూ
చూడచక్కగుంటదీ
తింటె బంకగుంటదీ
ఏంటదీ-ఏంటదీ??

కూరలమ్మా -కూరలూ
కూరగాయల కూరలూ
చూడచక్కగుంటదీ
తింటె బంకగుంటదీ
బెండకాయ కూరదీ!!




కామెంట్‌లు