వైవిధ్యం- సాయి వేమన్ దొంతి రెడ్డికుంచనపల్లి,గుంటూరు జిల్లా,9182244143
 సూర్యోపాసన చేయాలి  దీనివల్ల జరిగే ప్రయోజనాలు ఏమిటంటే  సూర్యోదయానికన్నా ముందు  లేచి ప్రశాంత వాతావరణంలో  గాయత్రి మంత్రం లో ఉన్న 24 అక్షరాలకు 24 భంగిమలలో  ఆసనాలు వేయవలసిన అవసరం ఉంది  దానివల్ల శరీరంలో ఉన్న 72, వేల నాడులు  సక్రమంగా పనిచేస్తాయి  నాడీ వ్యవస్థ ఎప్పుడైతే  దాని పని అది చేస్తూ ఉందో  ఆ వ్యక్తి నిండు నూరేళ్లు ఎలాంటి  రుగ్మతలకు లోనూ కాకుండా జీవితాన్ని హాయిగా ఆనందంగా ప్రశాంతంగా గడపడానికి అవకాశం ఉంటుంది  ప్రత్యేకంగా ఇవి చేయండి పూర్తి ఆయురారోగ్య ఐశ్వర్యభాగ్యాలతో తుల తూగండి అని మన పెద్దలు చెప్తారు. ఈ విషయాలన్నీ విన్న  పిల్లలు కొంతమంది నిరుత్సాహపడవచ్చు  మరి కొంతమంది పిల్లలు ఉత్సాహపడవచ్చు  దీనిని మనం ప్రత్యక్షంగా చేయగలమా అనేది వారి సందేహం అంత త్వరగా లేచే శక్తి మనకు ఉన్నదా అని వారి అనుమానం 24 ఆసనాలు వేయడం అంటే మాటలా  మనకు 2-3 ఆసనాల కన్నా ఎక్కువ రావు అనే ఆలోచనలో మరికొందరు  ముందు మీరు పాటించండి అనుమానాలను ప్రక్కన పెట్టండి  ఒకేసారి అన్ని మార్పులు సాధ్యపడకపోవచ్చు  క్రమక్రమంగా ఒక్కొక్కటి మార్చుకుంటూ పోతే  కొన్ని నెలల తరువాత అయినా ఇవన్నీ మీరు చేసి తీరతారు  మనిషి తలుచుకుంటే  చేయలేని పని లేదు అని మన పెద్దలు మనకు చిన్నతనంలోనే చెప్పారు  అది జ్ఞాపకం పెట్టుకుని మీరు ఇది ప్రయత్నం చేయండి  అని అమ్మ చెబితే తప్పకుండా చేస్తారు
కాల మహిమ  అనే మన పెద్దలు చెబుతారు దీనికి మహిమ ఏముంటుంది అని మనం ఆలోచిస్తాం  నీవు ఎక్కడ జీవిస్తున్నావు  గతంలో నా  అది జరిగిపోయింది కదా  దానిని గురించి ఆలోచిస్తూ కూర్చుంటే ప్రస్తుతం నీవు ఉన్న  వర్తమాన కాలం కూడా గతంలోకి వెళ్ళిపోతుంది  లేదూ నీవు మౌనంగా ఉన్నట్లయితే  రాబోయే  ఆగతం కూడా  వర్తమానాన్ని దాటి గతంలోకి వెళ్ళిపోతుంది  కనుక కాలంతో ఆడుకోవద్దు  కాలాన్ని సద్వినియోగం చేసుకో ఏ క్షణాన ఏ పని చేయాలో దానిని ఆచరణ చేస్తే  నీ ఆరోగ్యం బావుంటుంది  ఒక తాగుబోతు తిరుగుబోతు  అనే పేరు పడ్డ  వేదాంతి ఉమర్ కయాం  ఆయన ఏమన్నాడు  నిన్నన్నది గడిచిపోయే రేపు అన్నది కలదో లేదు  నేడు అన్నది నేడు ఉన్నది నిజం నిజం అనుభవించు అనుసరించు అంటాడు.


కామెంట్‌లు