వైవిధ్యం;- సాయి వేమన్ దొంతి రెడ్డి,కుంచన పల్లి,9182244143
 సర్వ సంగ పరిత్యాగి  కాషాయ ధారి  ప్రపంచానికి అద్వైత సిద్ధాంతాన్ని ప్రచారం చేయడానికి వచ్చిన మహా మేధావి  కంచి  పరమాచార్య మహాస్వామి చంద్రశేఖర సరస్వతి స్వాములవారు  సీతారామ కళ్యాణం చిత్రంలోని అన్నగారి నటన గురించి విని  ప్రత్యేకంగా సినిమాను చూసి అన్నగారి నిమెచ్చి  వారిని ఆహ్వానించి  తన శిష్య గణ సముదాయం మధ్య  విశ్వవిఖ్యాత నట సార్వ    భౌమ బిరుదు ప్రదానం చేయడం విశేషo రాముడు ఎలా ఉంటాడో ఎలా ప్రవర్తిస్తాడో ఎలా మాట్లాడుతారో  స్వామివారికి తెలిసినట్టుగా మరి ఎవరికీ తెలియదు కదా  అలాంటి మహర్షి భౌతిక సుఖాలకు దూరంగా ఉన్నవాడు  ఆధ్యాత్మికత పుణికి పుచ్చుకున్న  ఆ పాత్ర నిజ స్వరూపాన్ని  ప్రత్యక్షంగా వీక్షించి  రామారావు గారికి బిరుదు ప్రదానం చేయడం చరిత్రలో మరెక్కడా జరగని విశేషం  ఎన్టీఆర్ ఎన్ని బహుమతులు పొందినా ఎన్ని  బిరుదులు పొందినా దేశానికి ఎంత మంచి చేసినా స్వామివారి కటాక్షం తరువాతనే  కనుకనే ఎన్టీఆర్ మరణించి భౌతికంగా ఎన్ని రోజులైనా  సంవత్సరాలయిన జ్ఞాపకం చేసుకోవడానికి కారణం స్వామీజీ.చిన్నపిల్లల నుంచి  పెద్దల వరకు ప్రతి ఒక్కరూ  పెరుగును ఇష్టపడని వాడు లేరు  ఎలాంటి పెరుగు తినాలి అని చెబుతున్నాడు
బ్రాహ్మణులకు  భోజన ప్రియులు అని పేరు కాళిదాసు అద్భుతమైన  రుచిని మనకు అందించాడు  ఎలాంటి పెరుగు రుచిగా ఉంటుందో చెప్పాడు  గవిడి గేదెను తీసుకువచ్చి దాని పాలు తీసి వేడి చేసి  ఆ వేడి చేయడం కూడా  శరదృతువు లో చంద్రుడు ఇచ్చే  వెన్నెల ఏ రంగులో ఉంటుందో ఆ రంగు వచ్చేంతవరకు కాచి ఆర్పి తోడు వేసి  తరువాత మీగడ పెరుగు తిన్నట్లయితే దాని రుచి  చెప్పడానికి వీలు లేదు అంటాడు కాళిదాసు కానీ శాస్త్రజ్ఞులు రాత్రిపూట భోజనం పెరుగు తో చేయడం వల్ల రోజు రోజుకు ఆరోగ్యం క్షీణించి ఆయుషు తగ్గుతుంది అని చెప్తారు  ఏ రోజు పెరుగుతో భోజనం చేయాలని అనుకుంటే ఆరోజు చాపల కూర వాడకూడదు అలా చేసినట్లయితే అజీర్ణపాలవుతారు.
చాలామందికి తెలుగులో మామిడిపండు రసం నంజుకుని తినే అలవాటు ఉంటుంది అలాంటి వారికి  అజీర్ణ వ్యాధితో పాటు ఎసిడిటీ కూడా వస్తుంది  కొంతమంది పెరుగు లో బెల్లం కలుపుకుంటారు  దీనివల్ల దగ్గు జలుబు జ్వరం వచ్చే అవకాశం ఉంది  పెరుగు అన్నంతో పాటు కొంతమంది పరాటా తీసుకునే వారికి అజీర్ణంతోపాటు నీరసం కూడా వస్తుంది పాలు పెరుగు కలిపి తీసుకుంటే కడుపులో సమస్యలు ఇన్ఫెక్షన్స్ వస్తాయి  పెరుగు తిన్న తర్వాత చాయ్ టీ తాగితే జీవక్రియ వ్యవస్థలో అసమతుల్యత  పెరుగుతుంది  తెలుగులో ఉల్లిపాయ నంజుకున్న వాళ్ళకి మొటిమలు రావడం చికాకుగా ఉంటo జబ్బులు రావడం సామాన్యం  కనుక పెరుగుని పెరుగు గానే వాడాలి తప్ప మిగిలిన వాటితో భోజనం చేయకూడదని పెద్దలు చెప్తూ ఉంటారు  వారి మాటలను మనం  అనుసరించినట్లయితే ఆరోగ్యం జాగ్రత్తగా ఉంటుంది



కామెంట్‌లు
Popular posts
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
వినదగు నెవ్వరు చెప్పిన: --ఎం బిందుమాధవి
చిత్రం
కులవృత్తులు మరువకురా గువ్వలచెన్న వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల్ గొటిక ఖుర్డు ప్రాథమిక పాఠశాలలో కుల వృత్తుల పై విద్యార్థులు వినూత్న ప్రదర్శన విద్యార్థుల వినూత్న ప్రదర్శన అభినందించిన బషీరాబాద్ వైస్ ఎంపీపీ జడల అన్నపూర్ణ వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గోటిక ఖుర్దు స్కూల్లో గ్రామంలో ని కుల వృత్తులు పై విద్యార్థులు పాఠశాలల్లో వినూత్న ప్రదర్శన నిర్వహించారు నేటి సమాజంలో ప్రపంచీకరణ , ఆధునికత పేరుతో కులవృత్తులకు ఆదరణ కరువు అయినవీ పల్లె నుండి పట్నంకు బతుకుదెరువు కోసం కన్నతల్లిని ఉన్న ఊరిని వదిలి కుల వృత్తిని వదిలి పట్నంలో వెళ్లి కూలీ గా పనిచేస్తున్నారు కావున ఆనాటి నుండి నేటి వరకు గ్రామంలో అనేక కుల వృత్తుల ప్రాధాన్యత ఉంది సమాజంలో కుమ్మరి కమ్మరి మేతరి చాకలి . వడ్రంగి. రైతులు .పోస్ట్ మాన్ కురువ. లాయర్. డాక్టరు మొదలైన వృత్తుల ప్రతిబింబించే విధంగా కళ్లకు కట్టిన విధంగా పాఠశాల ఆవరణంలో విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళి హరినాథ్ విద్యార్థుల చేత 26 వేషధారణ వేసి విద్యార్థుల నైపుణ్యాన్ని వెలికి తీయడం కోసం మరుగునపడిన కులవృత్తులను గుర్తు చేసుకోవడం కోసం చక్క గా ప్రదర్శించడం జరిగింది విద్యార్థులలో చిన్నప్పటినుండి అన్ని అంశాలపై అవగాహన కలిగినట్లయితే భవిష్యత్తులో వారికి నిత్య జీవితంలో ఎంతో ఉపయోగపడుతుంది ప్రభుత్వ పాఠశాలలు మరింత బలోపేతం చేయడం కోసం విద్యార్థులను సర్వతోముఖాభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తున్నానని ప్రధానోపాధ్యాయుడు మురళి హరినాథ్ చెప్పారు విద్యార్థులకు ఒత్తిడి లేకుండా జాయ్ full learning నేర్పించాలని సంకల్పించడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లో గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి ఉపాధ్యాయులు జయ శ్రీ .నవనీత. విటల్ గౌడ్. చంద్రయ్య. సత్యం. ఆశన్నప్పా జ్యోతి. లక్ష్మీ. మరియు విద్యార్థులు పాల్గొన్నారు
చిత్రం
రామాయణం‌ నుండి108 ప్రశ్నలు –జవాబులు!:----సుజాత.పి.వి.ఎల్.
చిత్రం
పూర్వ విద్యార్థుల సమ్మేళనం అపురూపం::-యాడవరo చంద్రకాంత్ గౌడ్ తెలుగు పండిట్- సిద్దిపేట-9441762105
చిత్రం