వైవిధ్యం;- సాయి వేమన్ దొంతి రెడ్డి కుంచనపల్లి 9182244143
గతం ఎంత ఉన్నది అసలు గతం ఏమిటి అని తెలుసుకోవడానికి ప్రయత్నించిన వ్యక్తి  ముందు తన వంశవృక్షం ఏమిటో తెలుసుకోవడానికి  ప్రయత్నాలు చేస్తాడు  తన ప్రయత్నంలో తన తండ్రి తాత ముత్తాత వరకు  తెలిసినా  అంతకుముందు విషయాలు మనకు తెలియవు  అలాగే గతంలోకి వెళ్లాలి అనుకున్నప్పుడు  నీ పరిధిని పెద్దల పరిధిని దాటి వెళ్లడం కష్టం  దానిని మనవారు గతంలోకి  తొంగి చూడాలని అనుకుంటే  అది పాతాళం  లోతు తెలుసుకోవాలి అన్నట్టుగా ఉంటుంది  అలాగే  భవిష్యత్తు విషయాలను తెలుసుకోవాలనుకున్నప్పుడు అది ఆకాశానికి వెళ్ళినట్లుగా  ఎంత దూరం వెళ్ళినా అది  అంతంలేనిది అని తెలుస్తుంది తప్ప  దాని ఆకృతి తెలుసుకోవడం మన తరం కాదు. నిజానికి ఎవరి జాతకం వారికి తెలిసి ఉంటుంది ప్రత్యక్షంగా  తన ఆదాయం ఎంత తన కుటుంబ పరిస్థితి ఏమిటి అన్న విషయాలు తనకు బాగా తెలుసు  కానీ మనిషి ఆశాజీవి కనుక  తన భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అని ఉంటుంది  ఆ జాతకాన్ని నమ్మే వారు చేసేది  మన ఆశ  జాతకాలు చెప్పే వ్యక్తి ఏది చెపితే అది మనం నమ్ముతాం  కానీ జాతకం అనేదాన్ని  చేయి చూసి హస్త సాముద్రికంగా చెప్పగలిగిన వారు కొంతమంది ఉంటారు  పుట్టినరోజు  తెలుసుకొని దానికోసం చెక్రం వేసి చెప్పే వాళ్ళు కొంతమంది ఉంటారు  అయితే పుట్టినరోజు ఎవరికి తెలుసు  మన   తల్లి గర్భం నుంచి తల బయటకు వచ్చినప్పుడు ఆ సమయాన్ని చూసి అది పుట్టినరోజుగా తెలియజేస్తుంది. తల్లి గర్భం దాల్చిన క్షణం తల్లికి గాని తండ్రికి కానీ తెలుస్తుందా  అది తెలియకుండా ఆక్షణాన్ని గుర్తించకుండా తల్లి గర్భంలో 9 నెలలు ఉంటున్నాడో 10 నెలలు ఉంటున్నాడు ఆ బిడ్డ  అన్న విషయం పరీగణలోనికి తీసుకోకుండా మాట్లాడితే అది సరైన  జాతక ఫలితాన్ని ఇస్తుందా లేదా అన్న విషయాన్ని మనం గమనించినట్లయితే  ఆ జాతకం చెప్పేవాడు  సుమారుగా చెప్పడం తప్ప  కచ్చితంగా అతనికి కూడా తెలియదు అన్న విషయం స్పష్టంగా మనకు అర్థం అవుతుంది  కనక ఆశ ఆశగానే  మిగిలిపోతుంది అని విజ్ఞులు చెబుతూ ఉంటారు  ఏ మనిషి అయినా ఒక కోరిక కోరుకున్నప్పుడు అది ఎలా జరుగుతుంది దానిని  తీర్చే వ్యక్తి ఎవరు అని ఆలోచించినప్పుడు భగవంతుడు అనే సమాధానం వస్తుంది.

 

కామెంట్‌లు