ఆకాశవాణి విజయవాడ కేంద్రం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9482811322
 దానితో ఆలిండియా రేడియో అన్న పేరుని ఆకాశవాణి అన్న పేరుగా మార్చారు  భారతదేశంలో ఉన్న అన్ని  కేంద్రాలు ఆ మాటనే వాడుతూ ఉన్నాయి కానీ మద్రాస్ వారు మాత్రం తమిళంలోనే చెప్పుకునేవారు  ఆకాశవాణి అనేది సంస్కృత శబ్దం అందుకని మేము వాడము అన్నారు  ఆ తర్వాత మా జీతాలను కూడా ఎవరికి ఎంత జీతం అప్పటికి తీసుకుంటున్నారో దానిని బేసిక్ గా  మార్చమని జీవో పంపించారు  దాంతో మాకు  150 రూపాయలు నుంచి 3000 వరకు పెరిగినాయి జీతాలు పెరగడంతో కార్యక్రమాల స్థాయి తగ్గింది అని చెప్పవచ్చు  జీతాలు పెరిగే సరికి  కార్యక్రమాల గురించి ఆలోచన తగ్గింది అని  పెద్దలు తీర్మానించడం కూడా  జరిగింది.
నేను 1963 నుంచి అన్ని కార్యక్రమాల్లోనూ పాల్గొంటున్నాను బందాగారి దర్శికత్వంలో నాటకాలలో యండమూరి సత్యనారాయణ గారి(శ్రీవాత్సవ) ఉభయ కుశలోపరి  శ్రోతల ఉత్తరాలకు జవాబులు కార్యక్రమాన్ని అప్పటివరకు ఆ కార్యక్రమాన్ని నండూరు విట్టలు గారు నిర్వహిస్తూ ఉండేవారు కొన్నివారాలు శ్రీ రామ్మోహన్ రావు గారు  విట్టల్ గారు లేని సమయంలో చదివేవారు  కందుకూరి రామభద్ర రావు గారు డాక్టర్ జీవీ కృష్ణారావు గార్ల రచనలను వారు నాతోనే చదివించేవారు ఎవరైనా వక్తలు వచ్చినప్పుడు నాతో పరిచయ కార్యక్రమాలు చేయించడం నాకు ఆనందంగా ఉండేది  బందా గారు వచ్చేంతవరకు  రేడియోలో వైదికులే పరిపాలించారు తర్వాత శ్రీ వైష్ణవులు వచ్చారు.
చివరిగా 1960 తర్వాత నండూరి సుబ్బారావు గారు లాంటి నియోగులు వచ్చారు  నన్ను రేడియో ఉద్యోగానికి తీసుకువచ్చింది సుబ్బారావు గారి  నేను వచ్చేసరికి రికార్డింగ్ పద్ధతి వచ్చేసింది కనుక ఎక్కువ కార్యక్రమాలలో పాల్గొనడానికి అవకాశం ఏర్పడింది  ఉదయం 5 గంటలకు ప్రాంగణానికి వస్తే మళ్ళీ రాత్రి 11 గంటలకు ఇంటికి వెళ్ళేది  అందరి ప్రోత్సాహం నాకు ఉండేది ఆ రోజుల్లో రేడియో నాలుగో తరగతి క్లాస్ 4 ఉద్యోగాలు కూడా వైదికు లే చేస్తున్న పరిస్థితిలో నీవు ఎలా ఉద్యోగం సంపాదించగలిగావు పేరు  మార్చుకోవడం వల్లనే అని అడిగేవాడు నా పేరు ఆరు మళ్ల బ్రహ్మానందరెడ్డి మా గురువుగారు నండూరి సుబ్బారావు గారి సలహా మేరకు ఏ బి ఆనంద్ గా మార్చుకున్నాను అని దానికి నవ్వుతూనే సమాధానం ఇచ్చేవాన్ని.


కామెంట్‌లు