ఆకాశవాణి విజయవాడ కేంద్రం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322

సంగీత విద్వాంసుల గురించి మాట్లాడవలసి వస్తే  బాలమురళీకృష్ణ గారి దగ్గర నుంచి కృష్ణమాచార్యులు గారు  అన్నవరపు రామాస్వామి గార్లతో పాటు  ప్రతి ఒక్కరూ ఆకాశవాణి విజయవాడ కేంద్రానికి పేరు తెచ్చిన వారు అందుకే వారితో స్నేహం చాలా ఇష్టం  భారతదేశంలో ఏ కేంద్రానికి లేని గొప్ప విశేషం మా కేంద్రానికి ఏమిటి అని అంటే  ఒక అనౌన్సర్  జై ప్రకాష్  మరో ఎనౌన్సర్ రామం ఎస్ బి శ్రీరామ్ మూర్తి  తాను రాసిన నాటకాలను గురించి విశ్లేషణతో కూడిన వ్యాఖ్యలు  వ్రాసి పీహెచ్డీ పట్టా పొందిన  వాడు  ఇతర కేంద్రాల నుంచి రిలే తీసుకొనే స్థితి నుంచి  ఇతర ప్రాంతాలకు మద్రాస్ బెంగళూరు  తిరుచి మొదలగు  కేంద్రాలకు  రిలే చేయించుకునే    స్థితికి రావడం గర్వకారణం.
ఆకాశవాణిని ఆకాశం నుంచి పలికే మాట కావాలి  మనిషి రేడియోలో దాక్కునే మాట్లాడుతున్నాడు అన్న భ్రమ చాలా మందిలో ఉంది  అయితే ఆకాశవాణి ని మూడు విభాగాలు చేస్తే  త్రిపద సoగమంగా దానిని భావిస్తే  ఆ అంటే  ఆసాoతం ఈ చివర నుంచి ఆ చివర వరకు సమాచారం  ఆపాద మస్తకం ప్రయోగాలు  ఆపాద మస్తకము ను ఉదాహరణగా తీసుకుంటే పాదం నుంచి చివరి వరకు మాత్రమే అన్న అర్థం వస్తుంది  ఆ కలవడంతో అన్ని అవయవాలను క్రమములో చెప్పడం  కాశం అంటే వెలుగు ఆ వెలుగులో ఒక కిరణాన్ని మనం తీసుకున్నట్లయితే ఆ   కిరణంలో ఏడు కిరణాలు   సప్త వర్ణ శోహితమై ఉంటాయి  మిగిలిన రంగులు కనిపించకుండా తెలుపు మాత్రమే మనకు కనిపిస్తుంది.
ఆకాశవాణి కూడా రాముడు మంచి బాలుడు అని చెప్పి ఎందుకు మంచి బాలుడు అయ్యాడు వివరంగా మంచి చెడ్డలను వివరించి విశ్లేషణాత్మకంగా చెప్తుంది  ఆకాశవాణి అంటే మంచినే కాకుండా చెడును కూడా ప్రస్తావించి అది  మంచి ఎలా అయిందో విశ్లేషించడం రేడియో వాణి  అలా చెప్పడానికి పాండిత్యంతో పాటు విశ్లేషించడం కూడా తెలిసి ఉండాలి  ముందు ఏది మంచి ఏది చెడు అని విశదీకరించేటప్పుడు ఒక్కొక్క దానిని చెప్పాలి  అడవులకు ప్రయాణమై రథం ఎక్కిన రాముణ్ణి రామ రామ అని దశరథ మహారాజు పిలుస్తాడు  రథసారథి సుమంతుడు చెప్తూ ఉన్న నాకు వినిపించడం లేదు నీవు నీ పని చేయి రథం నడుపు అన్నాడు రాముడు నిజానికి ఇది అబద్ధం అనిపించుకోదు కారణం రాముడు తండ్రి దగ్గరకు వెళితే  దశరథ మహారాజు కౌగలించుకొని అడవులకు పంపేవాడు కాదు.

కామెంట్‌లు