ఆకాశవాణి విజయవాడ కేంద్రం;- ఏ.బి ఆనంద్,ఆకాశవాణి,విజయవాడ కేంద్రం,9492811322
 విపరీతమైన పేరు ప్రఖ్యాతలు పొందాడు బోస్ గురించి చెప్పుకోవాలంటే నా అనుభవంలో రెండు నాటకాలను ఉదహరించాలి మొదటి ఆది విష్ణు రచించిన సిద్ధార్థ ఎందరో జమీందారు వేషం వేశాడు దర్శకుడు కబీర్దాస్  అయినా అనేకసార్లు బోషే ఆ నాటకాన్ని నడిపించాడు నాకు రేడియోలో కాగితం చదవడం తప్ప మరో అలవాటు లేదు  లక్షల సార్లు విజయవాడ కేంద్రం అన్న ఆ మాటను కూడా కాగితం మీద రాసి చదవవలసిందే ఆ బలహీనత గురించి చెపితే దాని గురించి ఆలోచించకు ఆ బాధ్యత నేను తీసుకుంటాను అని చెప్పి డ్యూటీ అయిపోయిన తర్వాత తన కారులో తినుబండారాలతో సహా ప్రశాంతంగా ఉన్న ప్రాంతానికి తీసుకువెళ్లి గంటల తరబడి కాదు రోజుల తరబడి నాతో సాధన చేయించి సిద్ధార్థ లొ సత్యవేషానికి పూర్తి నిండుతనాన్ని తీసుకొచ్చింది  దానికి సహకారం మా బావ రామచంద్ర రాజు  ప్రస్తుతం మన మధ్య లేకపోయినా తన కష్టాన్ని సహకరించిన మా బావ  ను నేటికీ మర్చిపోలేను  బోసు కార్యక్రమాలు అన్నింటికి వెన్నెముకలుగా ఉండి నడిపించి ముందు పోయేవాడు అలాంటివాడు పోవడం నాకు బోసుకు తీరని లోటు ఆ ఖాళీని ఎవరు పూరించలేరు.తాను నటించడమే కాక నటనలో సామర్థ్యం ఉన్న అనేక మందిని ఆహ్వానించి వారితో మంచి మంచి పాత్రలను చేయించేవాడు జనార్దన్ రెడ్డి గారు అయితే తాను పొరపాటుగా ఆలస్యంగా వచ్చిన సందర్భాలలో తిరిగి ప్రదర్శించమని అభ్యర్థించి మరీ తిలకించేవాడు అంత మంచి నటుడు ప్రయోక్త నాకు సన్నిహితుడు కావడం నా అదృష్టం తాను గన్నవరంలో నిర్వహించిన పరిషత్తులకు నన్ను జడ్జిగా ఆహ్వానించేవాడు ఆ తరువాత రేడియో నాటక శాఖ ఆడిషన్ లో ఉత్తీర్ణుడై నాతో పాటు అనేక నాటకాల్లో పాల్గొన్నారు  విజయవాడ కేంద్రాల్లోనే కాక కొత్తగూడెం లాంటి మిగిలిన కేంద్రాలలో కూడా మేమిద్దరం కలిసిన నటించిన నాటకాలు ఎన్నో ఉన్నాయి  నాటికి నేడు దొంగాటకం లాంటి నాటకాలలో తెనాలి శకుంతల  లాంటి పెద్ద నటీమణులతో నటించి నిర్వహించి దర్శకత్వాన్ని కూడా స్వీకరించాడు. దీనిలో ఎన్ వి ఎస్ వర్మ నేను పి రామచంద్ర రాజు గుంటూరు లక్ష్మీకాక గన్నవరం నుంచి తన శిష్యులను కూడా తీసుకొచ్చినాకే పని చేసేవాడు అతని పెరుగుదల చూసి నాకు చాలా ఆనందమే వేసింది ఒకరోజు డాక్టర్ కె వెంకట్ రాజు గారు నాటకం రిహార్సల్ చూసి బోస్ బాగా పెరిగారు అని  ప్రశంసించారు  అన్నిటికన్నా ముఖ్యం మానవుడి చిరంజీవి గిడుతూరి సూరి గారు రచయిత ఇది మూకాభినయ ప్రక్రియ దీనిలో ఏ పాత్ర తన సంభాషణ తాను చెప్పదు  వ్యాఖ్యాత చదువుతూ ఉంటాడు రేడియో కేంద్రానికి వచ్చి ఆ నాటక పుస్తకం నాపై విసిరి నన్ను చదవమన్నాడు మామూలుగా చదివాను రచన అద్భుతంగా ఉంది ఇంతకుముందు అనేకమంది వెంకట్రామయ్య (బాలనాగమ్మ) గారి లాంటి ఉద్దండులు  ప్రదర్శించాడు.


కామెంట్‌లు