చిన్ననాడే అన్నదమ్ములు;- అంకాల సోమయ్యదేవరుప్పులజనగాం9640748497
చిన్ననాడే
అన్నదమ్ములు
అనురాగాలు ఆప్యాయతలు 

పెరిగి పెద్దయ్యాక
పెళ్లిళ్లు అయ్యాక
పాలివారు,పగవారు

వ్యక్తిగత స్వార్థం పెరిగి
ఒకరంటే ,మరొకరికి పడక
పగవారై 

పరాయిఇంటినుండొచ్చిన
కోడళ్ళు
తన భర్తే సర్వస్వమని
ఇంటివారందరి ఆజ్ఞలు శిరసావహించనని

నేను నా మొగున్ని వరకట్నమిచ్చి
కొనుక్కున్నానని

గంపెడు సంతానమున్న 
ఈ పెద్ద కుటుంబంలో నేను ఇమడలేను
వేరుకాపురముంటే తప్పా 
నీతో కాపురం చేయను
అని భీష్మంచుకొని కూర్చున్న
 ఆ  ఇంటి పెద్దకోడలు

కొడుకుల పెళ్లీలన్నీ అయిపోయాక వేరు కాపురం ఉందురు లెండి అన్నా వినని
కోడలు

తప్పని పరిస్థితుల్లో వేరుకాపురము

తల్లిదండ్రుల ఎడబాపినట్టు

అన్నదమ్ముల ఎడబాపినట్టు

అవసాన దశకొస్తున్నతల్లిదండ్రుల
భుజాలపై కుటుంబ ఆర్థిక సామాజిక
భారాన్ని మోపడం

చదువు పూర్తికాని
ఇద్దరు తమ్ముళ్ళు పెళ్లి కావాల్సిన
ఒకచెళ్ళెలు
ఇక రెండవ మూడవ కుమారుల
జీవితాల్ని ప్రమాదంలో పడదోసిన
పెద్దకుమారుడి వేరు కాపురం

ఆ తల్లిదండ్రులు ఆశలు, కొడుకులిద్దరి అడియాశలయ్యాయి

కుమారుల చదువులు అర్థాంతరంగా
నిలిచిపోయాయంటు
తల్లిదండ్రుల మనోవేదన

ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో 
అడ్డాల నాడు బిడ్డలు కానీ
గడ్డాలు వచ్చాక బిడ్డలా!?
అని నిట్టూర్చిన తల్లిదండ్రులు 
====================================
(మే- 24 ‌ -జాతీయసోదరుల దినోత్సవం సందర్భంగా వ్రాయబడిన కవిత ఇది)

కామెంట్‌లు