నిశ్శబ్దాన్ని ఛేదిద్దాం-;- అంకాల సోమయ్యదేవరుప్పులజనగాం9640748497
గతమంతా చేదు జ్ఞాపకమే 
చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంలేక
మనోనిగ్రహం కోల్పోయినాడు

 క్షణికావేశంలో చేసిన
అసుర‌క్షిత లైంగిక చర్య మూలంగా

ఒంట్లో చేరెను ఎయిడ్స్ వైరస్
కాలం సృష్టించిన కరువుకాటకాలు
దూరదేశపు వలసప్రయాణం

మనసు మాట వినక దేహం
లైంగిక సంపర్కానికై వెంపర్లాడటం

వేశ్యతో కలయిక తగని రోగం
బహుమానం

శరీరబరువు తగ్గడం
రోగనిరోధక వ్యవస్థ కుప్పకూలడం

మహమ్మారి ఎయిడ్స్ వైరస్
 విజృంభణతో పొడచూపిన లక్షణాలు 

స్వదేశాగమనం బక్కచిక్కిపీనుగైన
పెనిమిటిని చూసి 
కట్టుకున్న ఇల్లాలు
 ఏంటి మామ ఏమైంది నీకు
 ఏమైంది నీకు

చెప్పకుంటే నా మీద 
పిల్లలమీద ఒట్టే
ఒంట్లో చేరిన మాయరోగం తేటతెల్లం

ఇక చావుతప్పా
మరోదారేలేదని
నెత్తినోరు బాదుకోవడం

మామ నువ్వు గుండె ధైర్యం
చెడొద్దు పెద్దాసుపత్రిల పెద్ద డాక్టర్ కు నిన్ను చూపిస్తా
నిన్ను చావనివ్వను మామ

ఆరోజు డిసెంబర్ 1 చౌరస్తా లో
ఎయిడ్స్ వ్యతిరేకర్యాలీ తీస్తున్నారు
అది గమనించిన సీత 
మామ వెతకపోయినది కాలికే
తగిలి నట్టు
నిశ్శబ్దాన్ని చేధిద్దాం-
ఎయిడ్స్ గురించి చర్చిద్దాం
అన్న నినాదం సీత చెవిన పడింది
ఎయిడ్స్ స్పెషలిస్ట్ డాక్టర్ దగ్గరికి సీత తన మామను
తీసుకెళ్ళిచూపించింది
రోగి బాడీ ఎగ్జామిన్ చేసిన డాక్టర్ 
ఎయిడ్స్ అంటే మరణం కాదు
ఎయిడ్స్ నియంత్రణకు ఇప్పుడు మందులున్నవి
ఎయిడ్స్ ఒక అసురక్షిత శారీరక సంబంధాలవల్ల
మరియు అసురక్షిత సూదులు సిరంజీలు, రక్తమార్పిడి వల్ల ఒకరినుంచి మరొకరికి సోకుతుంది
అని డాక్టర్ చెప్పి మీ ఆయనకు
ఎటువంటి ఇబ్బందిలేదు ఈ మందులు వాడండి 
 ఇక ఇంటికి
తీసుకెళ్ళొచ్చు అని అన్నాడు
సీత
 మామ మన కష్టాలన్నీ ఇక తీరుతాయి లేమామ నీకు నేనున్నా!?


కామెంట్‌లు